ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ త్వరలోనే తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. వన్డే ప్రపంచకప్-2023 ముగిసిన తర్వాత స్వదేశంలో మోకాలి సర్జరీ చేసుకోనున్నట్లు స్టోక్స్ తెలిపాడు. అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టోక్స్.. వరల్డ్‌కప్‌కు ముందు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
ఈ క్రమంలో వరల్డ్‌కప్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన స్టోక్స్.. మోకాలి నొప్పి కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత జట్టులోకి వచ్చినప్పటికీ స్టోక్స్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. ఇక ఇది ఇలా ఉండగా.. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత్‌కు రానుంది.
ఈ నేపథ్యంలో స్టోక్స్ విలేకరులో మాట్లాడుతూ.. "టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్‌కు నేను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాను. ప్రపంచ కప్ తర్వాత నేను మోకాలి సర్జరీ చేసుకోనున్నాను. గత 18 నెలలగా మెకాలి నొప్పితో బాధపడుతున్నాను. అయితే ప్రస్తుతం తీవ్రమైన నొప్పి లేనప్పటికీ.. బౌలింగ్‌కు మాత్రం కష్టంగా ఉందని" పేర్కొన్నాడు.
చదవండి: World cup 2023: వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment