వన్డే ప్రపంచకప్-2023కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు ఇంగ్లండ్‌కు గుడ్‌న్యూస్ అందే అవకాశం ఉంది. ఆ జట్టు టెస్టు కెప్టెన్, వరల్డ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ మెన్‌జ్‌మెంట్ విజ్ఞప్తి మేరకు స్టోక్స్ మళ్లీ వన్డేల్లో ఆడేందుకు సిద్దమైనట్లు ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక 'ది టెలిగ్రాఫ్' తమ కథనంలో పేర్కొంది.
అయితే వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌కు విడ్కోలు పలకనున్నట్లు సమాచారం. "బెన్ స్టోక్స్ తన రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్ తీసుకోవడానికి సిద్దమయ్యాడు. భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ తరపున మళ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇందుకోసం వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌ను త్యాగం చేయనున్నాడు. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్‌తో సంప్రదింపులు తర్వాత స్టోక్స్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని" 'ది టెలిగ్రాఫ్' వెల్లడించింది.
2019లో స్టోక్స్ అద్భుత ఆటతీరుతోనే తొలిసారిగా ఇంగ్లండ్ తొలి సారిగా వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అనంతరం తన ఫిట్‌నెస్ కారణంగా గతేడాది వన్డేలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక వన్డే ప్రపంచకప్‌కు తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ మంగళవారం ప్రకటించనుంది. మరి ఈ జట్టులో స్టోక్స్ ఉంటాడో లేదో వేచి చూడాలి. ఇక ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్5న న్యూజిలాండ్‌తో తలపడనుంది.
చదవండి: తిలక్ వర్మ... పేరు గుర్తుంచుకోండి!
Comments
Please login to add a commentAdd a comment