క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్-2023 దగ్గరపడుతోంది. అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీలో షురూ కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రిలిమనరీ జట్టును కూడా ప్రకటిచింది.
ఈ క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ కూడా ప్రపంచకప్ కోసం తమ జట్టును ప్రకటించేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ కోసం 18 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ సెలక్టర్లు మంగళవారం ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ లేమి కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న పేసర్ జోఫ్రా అర్చర్‌పై సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అతడికి అవకాశం ఇవ్వాలా వద్ద అన్నది సెలక్టర్లు నిర్ణయించనున్నారు.
ప్లీజ్ స్టోక్స్ వచ్చేయ్..
ఇక 2019 వన్డే ప్రపంచకప్ హీరో, ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్.. గతేడాది వన్డేలకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అతడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుని మళ్లీ వన్డేల్లో ఎంట్రీ ఇస్తాడని ఇటీవల కాలంలో వార్తలు వినిపించాయి. కానీ యాషెస్ సిరీస్-2023 అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. ‘నేను రిటైర్ అయ్యాను.
ఈ టెస్టు ముగిసిన తర్వాత నేను సెలవులు తీసుకుంటాను. ఇప్పటికైతే ఇంతవరకే నేను ఆలోచిస్తున్నాను’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు. దీంతో స్టోక్స్ వన్డే వరల్డ్‌కప్ ఆడే ఛాన్స్ లేదని స్పష్టమైంది. అయితే ఇంగ్లండ్ జట్టు మెనెజ్‌మెంట్ మాత్రం తమ పట్టు వీడలేదు. స్టోక్స్‌ను వన్డే ప్రపంచకప్‌లో ఎలాగైనా భాగం చేయాలని ఇంగ్లండ్ క్రికెట్ భావిస్తోంది. ఇదే విషయంపై ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచ్ మాథ్యూ మాట్ స్పందించాడు.
"జోస్ బట్లర్ ఇప్పటికే స్టోక్స్‌తో టచ్‌లో ఉన్నాడు. అతడి రీ ఎంట్రీ కోసం చర్చిస్తున్నాడు. కానీ స్టోక్స్ మాత్రం తన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. అతడి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాము. అయితే స్టోక్స్ భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కానీ ఇంకా మేము అతడిపై ఆశలు పెట్టుకుని ఉన్నాము. అతడొక అద్భుతమైన ఆల్‌రౌండర్. అటువంటి ఆటగాడు జట్టులో కచ్చితంగా ఉండాలని" మాథ్యూ మాట్ పేర్కొన్నాడు.
చదవండి: #Stuart Broad: ఆస్తమాను అధిగమించి.. ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా! 600 వికెట్లతో..
Comments
Please login to add a commentAdd a comment