టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు విఫలమైన చోట.. పంత్ అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో 125 పరుగులు చేసిన పంత్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ డేవిడ్ విల్లీను పంత్ ఓ ఆట ఆడుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 42 ఓవర్ వేసిన బౌలింగ్‌లో పంత్ వరుసగా 5 ఫోర్లు బాదాడు. ఇక జో రూట్ వేసిన తర్వాత ఓవర్ తొలి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను పంత్ ఫినిష్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మూడో వన్డే
వేదిక: మాంచెస్టర్
టాస్: ఇండియా- బౌలింగ్
ఇంగ్లండ్ స్కోరు: 259 (45.5)
ఇండియా స్కోరు: 261/5 (42.1)
విజేత: భారత్.. 5 వికెట్ల తేడాతో గెలుపు
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషబ్ పంత్(125 పరుగులు- నాటౌట్)
చదవండి: ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్..వన్డేల్లో అరుదైన రికార్డు..!
Total madness from Rishab pant 🔥🔥#INDvsEND #RishabhPant #HardikPandya #ViratKohli pic.twitter.com/8lPcvIIlIy
— Shadow (@shadow_1713) July 17, 2022
Comments
Please login to add a commentAdd a comment