మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో శతకం బాదాడు.
మున్రో వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 104 పరుగులు చేసిన మున్రో చివరి ఓవర్ మొదటి బంతికి అవుటయ్యాడు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వాల్టన్, క్రిస్ గేల్ డకౌటయ్యారు.
గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. తాజాగా మూడో సెంచరీ చేసి ఇంటర్నేషనల్ టి20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment