రాజ్‌కోట్ : తొలి టీ20లో కడదాకా టీమిండియాతో పోరాడినా నెగ్గలేదన్న కసి.. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టులో రాజ్ కోట్‌లో జరిగిన రెండో టీ20లో స్పష్టంగా కనిపించింది. శనివారం జరిగిన ఆ మ్యాచ్‌లో కివీస్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో చెలరేగిన కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ కొలిన్ మున్రో(58 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) భారత్ ఓటమికి అక్కడ బీజం పడిందంటున్నాడు. అదేమంటే.. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలను స్వల్ప స్కోర్లకే ఔట్ చేసి తమ బౌలర్లు ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచారని పేర్కొన్నాడు. జట్టు భారీ స్కోర్ చేసినా.. కివీస్ బౌలర్లు రాణించడంతోనే తమ విజయం నల్లేరుపై నడకగా మారిందన్నాడు.
'ముఖ్యంగా కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సూపర్ ఫామ్‌లో ఉన్న ధావన్, రోహిత్ సహా నలుగురిని పెవిలియన్ బాట పట్టించి భారత్ పతనాన్ని శాసించాడు. తొలి ట్వంటీ20లో సెంచరీ (158) భాగస్వామ్యం నెలకొల్పిన భారత ఓపెనర్లు త్వరగా ఔట్ కావడంతో ప్రత్యర్థి జట్టు కాస్త వెనక్కి తగ్గింది. ఆరంభంలో కివీస్ పేసర్లు చెలరేగి వికెట్లు తీయగా, ఆపై స్పిన్నర్లు సమష్టిగా తమ పనిని పూర్తిచేశారు. పరుగులు రాబట్టడం కష్టంగా మారడంతో సాధించాల్సి రన్ రేట్ పెరిగిపోయి టీమిండియా ఆటగాళ్లపై పెరిగింది. దీంతో వారు వికెట్లను సమర్పించుకున్నారని' గత మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హీరో మున్రో వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment