నెత్తికొట్టుకున్న పాండ్యా! | Frustrated Hardik Pandya Facepalms Himself With Both Hands | Sakshi
Sakshi News home page

నెత్తికొట్టుకున్న పాండ్యా!

Published Sun, Feb 10 2019 1:43 PM | Last Updated on Sun, Feb 10 2019 2:38 PM

Frustrated Hardik Pandya Facepalms Himself With Both Hands - Sakshi

హామిల్టన్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్ల మిస్‌ ఫీల్డ్‌పై ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అసహనం వ్యక్తం చేశాడు. కివీస్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో ఓ వైపు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ దాటిగా ఆడుతుండగా.. మరోవైపు భారత ఫీల్డర్లు క్యాచ్‌లను చేజార్చి మంచి అవకాశాలను వదులుకున్నారు. హార్దిక్‌ పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతిని మున్రో భారీ షాట్‌ ఆడగా.. ఖలీల్‌ సులువైన క్యాచ్‌ను చేజార్చాడు.

మూడో బంతిని మళ్లీ మున్రో షాట్‌ ఆడగా శంకర్‌ మిస్‌ ఫీల్డ్‌తో బంతి బౌండరీకి వెళ్లింది. ఆ మరుసటి బంతినే మున్రో భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ వెంటనే మున్రో మరో క్యాచ్‌ ఇవ్వగా.. థర్డ్‌ మ్యాన్‌గా ఉన్న కుల్దీప్‌ అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన హార్దిక్‌ నెత్తిని బాదుకున్నాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. భారత ఆటగాళ్ల తప్పిదాలతో మొత్తం ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement