దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ 20లో మున్రో(104) శతకం సాధించాడు. 53 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. దాంతో టీ 20ల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా మున్రో రికార్డు సాధించాడు. ఇదిలా ఉంచితే. టీ 20 ర్యాంకింగ్స్‌లో సైతం ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. తొలిసారి అతని కెరీర్‌లో టాప్‌కు చేరుకున్న మున్రో ఏకంగా ఒకేసారి 11 స్థానాలు ఎగబాకడం ఇక్కడ విశేషం. మరొకవైపు న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోథీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఒకేసారి తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్‌కు చేరుకున్నాడు. ఫలితంగా 2009, 2010 తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లు టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. గతంలో బ్రెండన్ మెకల్లమ్, డానియల్ వెటోరీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో్ నిలిచారు. ఆపై ఇంతకాలానికి వారి సరసన మున్రో, సోథీలు నిలిచారు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లి 776 పాయింట్లతో ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మాత్రమే టాప్-10లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్రధాన పేసర్ బూమ‍్రా ఒక ర్యాంకు కోల్పోయి నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment