Sodhi
-
కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం
సాక్షి, సిద్ధిపేట: ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. చదవండి: హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్! -
కంపాకోలాతో కోకాకోలా,పెప్సికోకు గట్టి సవాల్ విసిరిన రిలయన్స్
-
కోహ్లిని వెంటాడుతున్న ఆ చెత్త రికార్డు.. సోధి మళ్లీ మెరుస్తాడా!
Ish Sodhi is threat looming large for India: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి ముప్పు పొంచి ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. షాహిన్ అఫ్రిది తరహాలో రెచ్చిపోతానని.. టీమిండియాకు బౌల్ట్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా వుంటే.. మరోవైపు బౌల్ట్ నుంచే కాదు ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధి నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందని క్రికెట్ నిపుణులు చెపుతున్నారు. ఎందుకంటే అతడు భారత్‌పైన మంచి రికార్డును కలిగి ఉండడమే దీనికి కారణం. భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు కోహ్లిను పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో 5 సార్లు ఔట్ చేసిన రికార్డును సోధి కలిగి ఉన్నాడు. కోహ్లిను ఈ చెత్త రికార్డు వెంటాడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో సోధిని కోహ్లి ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి. కాగా భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఈ ఏడాదిలో 8 మ్యాచ్‌లు ఆడిన సోధి 18 వికెట్లు సాధించాడు. ఈ మెగాటోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా రెండు కీలకమైన వికెట్లను సోధి పడగొట్టాడు. చదవండి: భారత్ గెలవాలంటే ఆ ముగ్గురు రావాలి: పాక్ మాజీ కెప్టెన్ -
రవిశాస్త్రి తర్వాత టీమిండియా హెడ్ కోచ్ అతనే..
ముంబై: గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా తొలిసారి రెండు దేశాల్లో వేర్వేరు జట్లతో తలపడుతుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో సీనియర్లతో కూడిన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధవన్ కెప్టెన్సీలో యువ భారత జట్టు శ్రీలంకకు వెళ్లింది. భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో.. టీమిండియా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ లంకకు వెళ్లిన బృందానికి కోచ్‌గా నియమించబడ్డాడు. ఇదిలా ఉంటే, రెగ్యులర్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌తో ముగియనున్న నేపథ్యంలో అతని తర్వాత కోచ్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా ప్రధాన కోచ్ రేసులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని భారత మాజీ ఆల్‌రౌండర్ రితేందర్ సింగ్ సోధి జోస్యం చెప్పాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా, అండర్-19 కోచ్‌గా మంచి సక్సెస్ రేట్ కలిగిన ద్రవిడ్‌కే కోచ్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీలంక పర్యటన నిమిత్తం ద్రవిడ్‌ను కోచ్‌గా పంపించడంలో బీసీసీఐ ఉద్దేశం క్లియర్‌గా ఉందని, దీంతో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌కు గ్రీన్ సిగ్నల్ అందినట్టేనని పేర్కొన్నాడు. వాస్తవానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా కేవలం ద్రవిడ్‌కే ఉందని తెలిపాడు. మరోవైపు రవిశాస్త్రి టీమిండియా కోచ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడని కొనియాడాడు. కాగా, సోధి భారత్ తరఫున 18 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. -
రాయల్స్ స్పిన్ కన్సల్టెంట్‌గా ఇష్ సోధి
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో న్యూజిలాండ్ లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి కొత్త అవతారంలో కనిపించనున్నాడు. గత రెండు సీజన్లలో ఆటగాడిగా రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సోధి తాజాగా కోచింగ్ బృందంతో కలిసి పనిచేయనున్నాడు. 27 ఏళ్ల సోధిని ‘స్పిన్ కన్సల్టెంట్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’గా నియమించినట్లు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గురు వారం ప్రకటించింది. ఇష్ సోధి ఇక నుంచి తమ స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులేతో కలిసి కోచింగ్ బాధ్యతలు పంచుకుంటాడని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో రాయల్స్ జట్టుకు ఆడిన సోధి మొత్తం 8 మ్యాచ్‌ల్లో 6.69 ఎకానమీ రేట్‌తో 9 వికెట్లను పడగొట్టాడు. గత నెలలో కోల్‌కతా వేదికగా జరిగిన వేలానికి ముందు సోధిని రాజస్తాన్ రాయల్స్ జట్టు విడుదల చేసింది. వేలంలో అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. -
ఒకేసారి 11 స్థానాలు ఎగబాకి...
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన తాజా టీ 20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కొలిన్ మున్రో టాప్ ప్లేస్‌ను ఆక్రమించాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ 20లో మున్రో(104) శతకం సాధించాడు. 53 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్లతో సెంచరీ నమోదు చేశాడు. దాంతో టీ 20ల్లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా మున్రో రికార్డు సాధించాడు. ఇదిలా ఉంచితే. టీ 20 ర్యాంకింగ్స్‌లో సైతం ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. తొలిసారి అతని కెరీర్లో టాప్కు చేరుకున్న మున్రో ఏకంగా ఒకేసారి 11 స్థానాలు ఎగబాకడం ఇక్కడ విశేషం. మరొకవైపు న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోథీ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒకేసారి తొమ్మిది స్థానాలు ఎగబాకి టాప్కు చేరుకున్నాడు. ఫలితంగా 2009, 2010 తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లు టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. గతంలో బ్రెండన్ మెకల్లమ్, డానియల్ వెటోరీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో్ నిలిచారు. ఆపై ఇంతకాలానికి వారి సరసన మున్రో, సోథీలు నిలిచారు. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లి 776 పాయింట్లతో ప్రస్తుతం మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో భారత బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ మాత్రమే టాప్-10లో నిలిచాడు. ప్రస్తుతం రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ప్రధాన పేసర్ బూమ్రా ఒక ర్యాంకు కోల్పోయి నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. -
ఆస్ట్రేలియానే ఫేవరెట్
సంజయ్ మంజ్రేకర్ తమ గ్రూపులో జరుగుతున్న పరిణామాలపై ఆస్ట్రేలియా జట్టు సంతోషంలో మునిగి ఉంటుంది. టి20 ఫార్మాట్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టును సొంత గడ్డపైనే న్యూజిలాండ్ ఓడించింది. ఈ ఫార్మాట్లో కివీస్ ఆటతీరు తెలిసిన వారికి షాక్ కలిగించిన ఫలితం అది. ఇక బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ జట్టు అనూహ్యంగా అద్భుత బ్యాటింగ్‌తో గెలిచింది. నిజానికి వారి బలమంతా బౌలింగే. ఇది ఆసీస్ గమనించే ఉంటుంది. హఫీజ్, షెహజాద్ బ్యాటింగ్ తీరుతో పాక్‌పై ఉన్న అనుమానాలు తేలిపోయాయి. దీంతో 19న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే మ్యాచ్‌ను భారత్ కాస్త జాగ్రత్తగానే ఆడాల్సి ఉంది. పొట్టి ఫార్మాట్‌ను మనం ధనాధన్ క్రికెట్‌గానే చూస్తాం. ఇతర ఫార్మాట్లలాగా ఇక్కడ టాస్, పిచ్, మైదానం పరిస్థితులు ఏవీ ప్రభావితం చూపవనుకుంటాం. కానీ ఈ పరిస్థితిని నాగ్‌పూర్ పిచ్ మార్చి భారత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈడెన్‌లో మంచుతో కూడిన పిచ్ కూడా విండీస్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా మారింది. అయితే వాతావరణం సరిగా ఉంటే ఆసీస్, కివీస్ మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్ పెద్దగా నిర్ణాయకం కాకపోవచ్చు. ఇదే జరిగితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌గా చెప్పవచ్చు. భారత్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారీ తేడాతో విజయం సాధించింది. దీంట్లో భాగంగా వారి స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్ కలిపి 29 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టారు. టి20 పరంగా చూస్తే ఇవి అద్భుతమైన గణాంకాలు. అయితే ధర్మశాలలో పిచ్ స్వభావరీత్యా వీరు ఇలాంటి ప్రదర్శనే ఇస్తారని ఆశించలేము. అందుకే ఆసీస్‌కు కాస్త ఎక్కువ అవకాశాలున్నాయి.