కుర్రోకుర్రు.. కేసీఆర్‌ పీఎం.. హరీశ్‌రావు సీఎం | Minister Harish Rao Will Become As Cm Of Telangana Said Girl Sodhi | Sakshi
Sakshi News home page

కుర్రోకుర్రు.. కేసీఆర్‌ పీఎం.. హరీశ్‌రావు సీఎం

Published Tue, Apr 18 2023 12:24 PM | Last Updated on Tue, Apr 18 2023 1:27 PM

Minister Harish Rao Will Become As Cm Of Telangana Said Girl Sodhi - Sakshi

సాక్షి, సిద్ధిపేట: ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్‌ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్‌ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది.

మండల బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు.
చదవండి: హైదరాబాద్‌ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్‌ ట్విస్ట్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement