
Ish Sodhi is threat looming large for India: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ నుంచి ముప్పు పొంచి ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. షాహిన్ అఫ్రిది తరహాలో రెచ్చిపోతానని.. టీమిండియాకు బౌల్ట్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా వుంటే.. మరోవైపు బౌల్ట్ నుంచే కాదు ఆ జట్టు స్పిన్నర్ ఇష్ సోధి నుంచి కూడా ప్రమాదం పొంచి ఉందని క్రికెట్ నిపుణులు చెపుతున్నారు.
ఎందుకంటే అతడు భారత్‌పైన మంచి రికార్డును కలిగి ఉండడమే దీనికి కారణం. భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇప్పటి వరకు కోహ్లిను పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో 5 సార్లు ఔట్ చేసిన రికార్డును సోధి కలిగి ఉన్నాడు. కోహ్లిను ఈ చెత్త రికార్డు వెంటాడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో సోధిని కోహ్లి ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి. కాగా భారత్‌తో 12 మ్యాచ్‌లు ఆడిన సోధి 17 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఈ ఏడాదిలో 8 మ్యాచ్‌లు ఆడిన సోధి 18 వికెట్లు సాధించాడు. ఈ మెగాటోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో కూడా రెండు కీలకమైన వికెట్లను సోధి పడగొట్టాడు.
చదవండి: భారత్ గెలవాలంటే ఆ ముగ్గురు రావాలి: పాక్ మాజీ కెప్టెన్