జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో న్యూజిలాండ్ లెగ్‌స్పిన్నర్ ఇష్ సోధి కొత్త అవతారంలో కనిపించనున్నాడు. గత రెండు సీజన్లలో ఆటగాడిగా రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సోధి తాజాగా కోచింగ్ బృందంతో కలిసి పనిచేయనున్నాడు. 27 ఏళ్ల సోధిని ‘స్పిన్ కన్సల్టెంట్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’గా నియమించినట్లు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ గురు వారం ప్రకటించింది. ఇష్ సోధి ఇక నుంచి తమ స్పిన్ కోచ్ సాయిరాజ్ బహుతులేతో కలిసి కోచింగ్ బాధ్యతలు పంచుకుంటాడని ఫ్రాంచైజీ అధికారి ఒకరు తెలిపారు. 2018, 2019 ఐపీఎల్ సీజన్లలో రాయల్స్ జట్టుకు ఆడిన సోధి మొత్తం 8 మ్యాచ్‌ల్లో 6.69 ఎకానమీ రేట్‌తో 9 వికెట్లను పడగొట్టాడు. గత నెలలో కోల్‌కతా వేదికగా జరిగిన వేలానికి ముందు సోధిని రాజస్తాన్ రాయల్స్ జట్టు విడుదల చేసింది. వేలంలో అతనిపై ఎవరూ ఆసక్తి చూపలేదు.
Comments
Please login to add a commentAdd a comment