పొలార్డ్ (4/30)
తరోబా (ట్రినిడాడ్): కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ విజయ యాత్ర టైటిల్ గెలుచుకోవడంతో ముగిసింది. టోర్నీలో పరాజయమనేదే లేకుండా సాగిన ఈ జట్టు వరుసగా 12వ మ్యాచ్ గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా జూక్స్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జూక్స్ 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.
ఆండ్రీ ఫ్లెచర్ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలవగా...కీరన్ పొలార్డ్ (4/30) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు సాధించింది. లెండిన్ సిమన్స్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 88 బంతుల్లో అభేద్యంగా 138 పరుగులు జోడించారు. ట్రినిడాడ్ జట్టు సీపీఎల్ టైటిల్ గెలవడం నాలుగో సారి కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment