శివాలెత్తిన గప్తిల్‌.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం | CPL 2023: Martin Guptill Century Ensures Dominant Knight Riders Win - Sakshi
Sakshi News home page

శివాలెత్తిన మార్టిన్‌ గప్తిల్‌.. 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం

Published Thu, Aug 31 2023 2:47 PM | Last Updated on Thu, Aug 31 2023 3:14 PM

CPL 2023: Martin Guptill Century Ensures Dominant Knight Riders Win - Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌లో తొలి సెంచరీ నమోదైంది. బార్బడోస్‌ రాయల్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 31) జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో బౌండరీ, 9 సిక్సర్ల సాయంతో అజేయమైన 100 పరుగులు చేశాడు. గప్తిల్‌కు పోలార్డ్‌ (32 బంతుల్లో 46; ఫోర్‌, 4 సిక్సర్లు), మార్క్‌ దెయాల్‌ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

నైట్‌రైడర్స్‌లో గప్తిల్‌, పోలార్డ్‌తో పాటు నికోలస్‌ పూరన్‌ (6), ఆండ్రీ రసెల్‌ (5), డ్వేన్‌ బ్రావో (0) లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. గప్తిల్‌ ధాటికి బార్బడోస్‌ బౌలర్‌ ఓబెద్‌ మెక్‌కాయ్‌ బలయ్యాడు. అతను 4 ఓవర్లు వేసి వికెట్లేమీ తీయకుండా 47 పరుగులు సమర్పించుకున్నాడు. గప్తిల్‌ మరో బార్బడోస్‌ బౌలర్‌ రకీమ్‌ కార్న్‌వాల్‌ను కూడా ఆడుకున్నాడు. కార్న్‌వాల్‌ కేవలం 2 ఓవర్లు వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు. బార్బడోస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్‌ 2.. కైస్‌ అహ్మద్‌, వాన్‌ డర్‌ మెర్వ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

వకార్‌ దెబ్బకు కుప్పకూలిన బార్బడోస్‌..
నైట్‌రైడర్స్‌ నిర్ధేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్‌.. వకార్‌ సలామ్‌ కైల్‌ (3.1-0-14-4), ఆండ్రీ రసెల్‌ (2-0-13-2), అకీల్‌ హొసేన్‌ (4-0-16-2), సునీల్‌ నరైన్‌ (2-0-11-1) దెబ్బకు 12.1 ఓవర్లలో 61 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. బార్బడోస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రకీమ్‌ కార్న్‌వాల్‌, కైల్‌ మేయర్స్‌ డకౌట్లు కాగా.. లారీ ఈవాన్స్‌ (5), అథనేజ్‌ (2), కెవిన్‌ విక్హమ్‌ (9), యంగ్‌ (3), వాన్‌ డర్‌ మెర్వ్‌ (3), ఓబెద్‌ మెక్‌ కాయ్‌ (1) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. జేసన్‌ హోల్డర్‌ (14), రోవ్‌మన్‌ పావెల్‌ (10), కైస్‌ అహ్మద్‌ (10 నాటౌట్‌) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement