టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ ఈ ఫీట్‌ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్‌లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.
పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్‌తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్‌లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్‌కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు.
చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment