Johnson Charles
-
రాణించిన డుప్లెసిస్, ఛార్లెస్.. సీపీఎల్ ఫైనల్లో లూసియా కింగ్స్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్స్‌కు చేరింది. ఇవాళ (అక్టోబర్ 3) జరిగిన క్వాలిఫయర్-1లో లూసియా కింగ్స్ గయానా అమెజాన్ వారియర్స్‌పై 15 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిన) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్‌కు వరుణుడు ఆడ్డు తగిలాడు. వారియర్స్ ఇన్నింగ్స్ 13 ఓవర్ల వరకు సజావుగా సాగింది. ఈ దశలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన లూసియా కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి అమెజాన్ వారియర్స్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 106 పరుగులుగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. అమెజాన్ వారియర్స్ బార్బడోస్ రాయల్స్‌తో క్వాలిఫయర్-2 ఆడనుంది. అక్టోబర్ 5న జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు అక్టోబర్ 7న జరిగే ఫైనల్లో లూసియా కింగ్స్‌తో తలపడుతుంది.రాణించిన డుప్లెసిస్, జాన్సన్ ఛార్లెస్అమెజాన్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ (57), జాన్సన్ ఛార్లెస్ (79) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు మినహా లూసియా ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రోస్టన్ ఛేజ్, టిమ్ సీఫర్ట్ తలో 18 పరుగులు, డేవిడ్ వీస్ 13, మాథ్యూ ఫోర్డ్ 0, జెర్మియా 1 పరుగు చేశారు. వారియర్స్ బౌలర్లలో మొయిన్ అలీ, ప్రిటోరియస్ తలో రెండు, షమార్ జోసఫ్ ఓ వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. రహ్మానుల్లా గుర్బాజ్ 24, కీమో పాల్ 14, షాయ్ హోప్ 27, ప్రిటోరియస్ 2 పరుగులు చేసి ఔట్ కాగా.. హెట్‌మైర్ 37, మొయిన్ అలీ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. లూసియా కింగ్స్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, డేవిడ్ వీస్, ఛేజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.చదవండి: Irani Cup 2024: సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్ -
డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ
టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 74వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాఫ్ ఈ ఫీట్‌ను సాధించాడు. సెంచరీలతో (6) కలుపుకుని ఫాఫ్ తన కెరీర్లో మొత్తం 80 సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం పది మంది (ఫాఫ్‌తో సహా) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ టాప్‌లో (112) ఉండగా.. క్రిస్ గేల్ (110), విరాట్ కోహ్లి (106), బాబర్ ఆజమ్ (101), జోస్ బట్లర్ (90), అలెక్స్ హేల్స్ (88), రోహిత్ శర్మ (86), ఆరోన్ ఫించ్ (85), షోయబ్ మాలిక్ (83), ఫాఫ్ డెప్లెసిస్ (80) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.ట్రిన్‌బాగో అండ్ నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (43 బంతుల్లో 59), జాన్సన్ ఛార్లెస్ (40 బంతుల్లో 89) అర్ద సెంచరీలతో రాణించారు. కీరన్ పోలార్డ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ 17.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. డ్వేన్ బ్రావో (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నూర్ అహ్మద్ (3/39), డేవిడ్ వీస్ (2/27) నైట్‌రైడర్స్ పతనాన్ని శాశించగా.. పియెర్రి, అల్జరీ జోసఫ్, రోస్టన్ ఛేజ్, సడ్రక్ డెస్కార్టే తలో వికెట్ పడగొట్టారు. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో హేమాహేమీ హిట్టర్లు ఉన్నా జేసన్ రాయ్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ (41) చేశాడు. చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. శ్రీలంక తుది జట్టు ప్రకటన -
జాన్సన్ ఛార్లెస్ ఊచకోత.. సౌతాఫ్రికాను ఊడ్చేసిన విండీస్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్ స్వీప్ చేసింది. నిన్న జరిగిన ఆఖరి టీ20లో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ (26 బంతుల్లో 69; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి విండీస్‌ను గెలిపించాడు. కెప్టెన్ బ్రాండన్ కింగ్ (28 బంతుల్లో 44; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కైల్ మేయర్స్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 సిక్సర్లు) సైతం ఆకట్టుకున్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జీ, పీటర్‌కు తలో వికెట్ దక్కింది. దీనికి ముందు ఓబెద్ మెక్కాయ్ (4-0-39-3), గుడకేశ్ మోటీ (3-0-21-2), షమార్ జోసఫ్ (4-0-26-2) ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ అల్లాడిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డస్సెన్ (51), వియాన్ ముల్దర్ (36) మాత్రమే రాణించారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లను కూడా వెస్టిండీసే గెలిచింది. తొలి మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో.. రెండో టీ20లో 16 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చరిత్రలో విండీస్ టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడం ఇదే మొదటిసారి. -
విండీస్ ఓపెనర్ ఊచకోత.. బెంబేలెత్తిపోయిన పసికూన
ఐదు మ్యాచ్‌ల అనధికారిక టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. సిరీస్‌లో భాగంగా నిన్న (మే 1) జరిగిన మూడో మ్యాచ్‌లో పర్యాటక జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ జాన్సన్ ఛార్లెస్ మెరుపు శతకం (61 బంతుల్లో 119 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఛార్లెస్ ఊచకోత ధాటికి నేపాల్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ గెలుపుతో విండీస్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి మ్యాచ్‌లో నేపాల్ సంచలన విజయం సాధించగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో విండీస్ విజయం సాధించింది. ఇవాళ (మే 2) నాలుగో టీ20 జరుగుతుంది.మూడో టీ20 విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. జాన్సన్ ఛార్లెస్ శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో ఛార్లెస్‌తో పాటు ఆండ్రీ ఫ్లెచర్ (33 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. అలిక్ అథనాజ్ 17, ఫేబియన్ అలెన్ 19 పరుగులు చేసి ఔట్ కాగా.. కీమో పాల్ 13 పరుగులతో అజేయంగా నిలిచాడు. నేపాల్ బౌలర్లలో కరణ్, సాగర్ ధకల్ తలో వికెట్ పడగొట్టగా.. అథనాజ్ రనౌటయ్యాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. విండీస్ బౌలర్ల దెబ్బకు 19.2 ఓవర్లలో 151 పరుగులకే బిచానా సర్దేసింది. విండీస్ బౌలర్లలో హేడెన్ వాల్ష్ 3 వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ 2, మాథ్యూ ఫోర్డ్, ఓబెద్ మెక్కాయ్, ఫేబియన్ అలెన్ తలో వికెట్ పడగొట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో లోకేశ్ బమ్, కరణ్ తలో 28 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ సిరీస్‌లో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. -
వెస్టిండీస్ క్రికెటర్ ఊచ కోత.. కేవలం 26 బంతుల్లోనే!
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో షార్జా వారియర్స్ తొలి విజయం నమోదు చేసింది. సోమవారం దుబాయ్ వేదికగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో షార్జా గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దుబాయ్ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దుబాయ్ బ్యాటర్లలో సామ్ బిల్లింగ్స్(52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సికిందర్ రజా 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షార్జా వారియర్స్ బౌలర్లలో డానియల్ సామ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. తీక్షణ, క్రిస్ వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. చార్లెస్ ఊచకోత.. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షార్జా బ్యాటర్లలో విండీస్ ఓపెనర్ జాన్సెన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు బసిల్ హమిద్(24) ఆఖరిలో బౌండరీలు వర్షం కురిపించి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్వెల్.. -
CPL 2023: జాన్సన్ చార్లెస్ ఊచకోత.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో నిన్న (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. జాన్సన్ చార్లెస్ (52 బంతుల్లో 78; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాన్సన్‌తో పాటు కొలిన్ మున్రో (33) ఓ మోస్తరుగా రాణించగా.. రోషన్ ప్రైమస్ (19), సికందర్ రజా (18), రోస్టన్ ఛేజ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బార్బడోస్ బౌలర్లలో వాన్ డర్ మెర్వ్ 3 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ 2, ఓబెద్ మెక్కాయ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 196 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన బార్బడోస్.. అల్జరీ జోసఫ్ (2.3-0-7-3), పీటర్ హ్యాట్జోగ్లో (3-0-4-2), రోషన్ ప్రైమస్ (2-0-11-2), సికందర్ రజా (1/21), మాథ్యూ ఫోర్డ్ (1/28), ఖారీ పిమెర్ (1/28) ధాటికి 17.3 ఓవర్లలో 105 పరుగులకు చాపచుట్టేసింది. బార్బడోస్ ఇన్నింగ్స్‌లో న్యీమ్ యంగ్ (20), రకీమ్ కార్న్‌వాల్ (18), జేసన్ హోల్డర్ (18), వాన్ డర్ మెర్వ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో లూసియా కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకగా.. బార్బడోస్ ఆఖరి నుంచి రెండో స్థానానికి (ఐదో ప్లేస్) పడిపోయింది. పాయింట్ల పట్టికలో గయానా రెండో స్థానంలో ఉండగా.. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, జమైకా తలైవాస్ 3, 4 స్థానాల్లో, సెయింట్ కిట్స్ పేట్రియాట్స్ ఆఖరి స్థానంలో నిలిచాయి. -
ఎందుకు భయ్యా ఈ రిస్క్ షాట్లు.. కొంచెం తేడా జరిగుంటే? వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ భయంకర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటర్, విండీస్ స్టార్ ఓపెనర్ జాన్సన్ చార్లెస్ పెను ప్రమాదం తృటిలో తప్పించుకున్నాడు. మైదానంలో బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా విభిన్న షాట్లు ఆడాలనుకున్నప్పుడు బ్యాటర్లకు కొంచెం తెలివితో పాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఏదో గుడ్డిగా ప్రయోగాలు చేద్దామంటే గాయాల బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు చేసి చాలా మంది ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా చార్లెస్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయాలు కాలేదు. ఏం జరిగిదంటే? సెయింట్ లూసియా ఇన్నింగ్స్ 12 ఓవర్లో డ్వేన్ బ్రావో నాలుగో బంతిని ఫుల్ టాస్‌గా సంధించాడు. ఈ క్రమంలో చార్లెస్ బంతిని వికెట్ కీపర్ పై నుంచి పంపేందుకు స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. ఈ క్రమంలో బంతి వచ్చి అతడి గడ్డానికి తాకింది. బంతి తగిలిన దెబ్బకు అతని హెల్మెట్ ఎగిరి పడింది. అయితే ఈ సమయంలో తెలివిగా వ్యవహరించిన చార్లెస్.. హెల్మెట్ వికెట్లపై పడకుండా కాలితో తన్నాడు. కాగా వెంటనే ఫిజియో పరిగెత్తు కుంటూ వచ్చి అతడిని పరీక్షించాడు. అతడికి ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియెపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "మనకు రానిది అవసరమా భయ్యా.. కొంచెం తేడా జరిగింటే ఏంటి పరిస్థితి" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. చదవండి: భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై! What just happened!?! Johnson Charles almost dismissed by his own helmet! @BetBarteronline magic moment!#CPL23 #SLKvTKR #BetBarter pic.twitter.com/Ts6YxZY1m0 — CPL T20 (@CPL) August 26, 2023 -
వరుసగా రెండో మ్యాచ్‌లో విండీస్ ప్రతాపం
వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విండీస్.. నిన్న (జూన్ 6) జరిగిన రెండో వన్డేలో 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (47 బంతుల్లో 63; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), చివర్లో ఓడియన్ స్మిత్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బౌలర్లలో జహూర్ ఖాన్ 3.. అఫ్జల్ ఖాన్, సంచిత్ శర్మ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, ఆదిత్య షెట్టి ఓ వికెట్ పడగొట్టారు. 307 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బాసిల్ అహ్మద్ (49), అలీ నసీర్ (57), అయాన్ అఫ్జల్ ఖాన్ (25 నాటౌట్) ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యూఏఈ.. ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో హాడ్జ్, రోస్టన్ ఛేజ్ తలో 2 వికెట్లు.. అకీమ్ జోర్డన్, ఓడియన్ స్మిత్, యాన్నిక్ కారియా తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జూన్ 9న నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. చదవండి: పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్ -
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. కేకేఆర్‌కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేశాడు
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్ అందింది. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు జాన్సన్ చార్లెస్ కోల్‌కతా జట్టుతో కలిశాడు. కాగా కేకేఆర్ ఆటగాడు, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాస్ స్థానాన్ని చార్లెస్‌తో కేకేఆర్ భర్తీ చేసింది. ఇక చార్లెస్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటు దక్కే ఛాన్స్ ఉంది. కాగా టీ20 విధ్వంసకర ఆటగాళ్లలో చార్లెస్ ఒకడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ వెస్టిండీస్ తరపున 41 టీ20ల్లో 971 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 224 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కరీబియన్ 5600 పరుగులు చేశాడు. చార్లెస్ వంటి పవర్ హిట్టర్ జట్టులో చేరడం కేకేఆర్‌కు మరింత బలం చేకూరుస్తుంది. పంజాబ్‌తో మ్యాచ్‌కు కేకేఆర్ తుది జట్టు(అంచనా) జాన్సన్ చార్లెస్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చదవండి: IPL 2023-Mark Wood: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం! -
IPL 2023: లిటన్ దాస్ స్థానంలో బిగ్ హిట్టర్.. ఇక
IPL 2023- KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ చేరనున్నాడు. బంగ్లా ఆటగాడు లిటన్‌దాస్ కుటుంబ సభ్యుల ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్వదేశం పయనమయ్యాడు. దీంతో ఐపీఎల్-2023 మిగతా సీజన్ కోసం అతని స్థానంలో చార్లెస్‌ను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా తీసుకుంది. ఈ మేరకు కేకేఆర్ గురువారం ప్రకటన విడుదల చేసింది. బిగ్ హిట్టర్ ‘‘ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా లిటన్‌దాస్ ఏప్రిల్ 28న స్వదేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అతడు, అతడి కుటుంబ సభ్యులు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో చార్లెస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా జాన్సన్ చార్లెస్ విండీస్ తరఫున 41 అంతర్జాతీయ టి20లు ఆడి.. 971 పరుగులు చేశాడు. అదే విధంగా.. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు గెలిచిన కరీబియన్ జట్టులో చార్లెస్ సభ్యుడుగా ఉన్నాడు. అంతేగాక ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పొట్టిఫార్మాట్లో మొత్తంగా 224 మ్యాచ్‌లు ఆడి.. 5600 పరుగులు సాధించాడు. బిగ్ హిట్టర్‌గా పేరొందిన చార్లెస్ రాకతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. రైజర్స్పై విజయం ఇదిలా ఉంటే.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో గెలుపు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్ నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆల్‌టైమ్ పర్ఫెక్ట్ టీ20 మ్యాచ్.. డజన్‌కు పైగా రికార్డులు బద్దలు
సౌతాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న (మార్చి 26) జరిగిన రసవత్తర మ్యాచ్ పొట్టి ఫార్మాట్లో పర్ఫెక్ట్ మ్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. హోరీహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా పరుగులు సాధించడంతో పాటు అదే స్థాయిలో రికార్డులు కూడా కొల్లగొట్టారు. ఇరు జట్ల ధాటికి నిన్నటి మ్యాచ్‌లో డజన్‌కు పైగా రికార్డులు బద్దలయ్యాయి. ఆ రికార్డులేవంటే.. అంతర్జాతీయ టీ20ల్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ ఛేజ్ (సౌతాఫ్రికా- 259 టార్గెట్) అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ అత్యధిక టీమ్ స్కోర్- 258/5 అంతర్జాతీయ టీ20ల్లో సౌతాఫ్రికా అత్యధిక టీమ్ స్కోర్- 259/4 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 517 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు- 81 అంతర్జాతీయ టీ20ల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు- 35 అంతర్జాతీయ టీ20ల్లో బౌండరీల ద్వారా ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు- 394 వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ టీ20 హండ్రెడ్- జాన్సన్ చార్లెస్ (39 బంతుల్లో) సౌతాఫ్రికా తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టి- క్వింటన్ డికాక్ (15 బంతుల్లో) పవర్ ప్లే (6 ఓవర్లు)లో అత్యధిక టీమ్ టోటల్- 102/0 (సౌతాఫ్రికా) అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా 200 పరుగులు పూర్తి చేసిన జట్టు (సౌతాఫ్రికా-13.5 ఓవర్లలో) మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు (సౌతాఫ్రికా-149) -
చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
అంతర్జాతీయ టీ20ల్లో దక్షిణాఫ్రికా సరి కొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అత్యధిక టార్గెట్ ఛేదించిన జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 259 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసిన ప్రోటీస్.. ఈ ప్రపంచ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2018లో ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20లో 245 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఛేజింగ్ కాగా.. తాజా మ్యాచ్‌తో ప్రోటీస్ ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది. 259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 44 బంతులు ఎదుర్కొన్న డికాక్ 9 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 100 పరుగులు చేశాడు. డికాక్‌తో పాటు మరో ఓపెనర్ రెజా హెండ్రిక్స్ (28 బంతుల్లో 68 పరుగులు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో కెప్టెన్ మార్క్రమ్ 38 పరుగులతో ఆజేయంగా నిలిచి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. జాన్సన్(118) అద్బుతమైన సెంచరీ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే! -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచ రికార్డు సమం!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లోనే చార్లెస్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. వెస్టిండీస్ ప్రపంచ రికార్డు.. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్స్‌లు నమోదు చేసింది. తద్వారా విండీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆఫ్గానిస్తాన్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ కూడా 22 సిక్స్‌లు బాదింది. ఆ తర్వాతి స్ధానంలో కూడా విండీస్‌నే ఉంది. 2016లో భారత్‌తో జరిగిన టీ20లో విండీస్ 21 సిక్స్‌లు కొట్టింది. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 23 బంతుల్లోనే! -
వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 39 బంతుల్లోనే!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చార్లెస్ కేవలం 39 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించాడు. విండీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కింగ్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన చార్లెస్.. మొదటి బంతి నుంచే ప్రోటీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. 23 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న ఈ కరీబియన్.. అనంతరం మరో 16 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను పూర్తిచేశాడు. ఇక 39 బంతుల్లో విధ్వంసకర శతకం సాధించిన చార్లెస్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. చార్లెస్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ క్రికెటర్‌గా చార్లెస్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2016లో ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో గేల్ 47 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో 39 బంతుల్లోనే సెంచరీ సాధించిన చార్లెస్.. గేల్ రికార్డు బ్రేక్ చేశాడు. ►అదే విధంగా విదేశీ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన విండీస్ క్రికెటర్‌గా చార్లెస్(118) నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉండేది. 2007లో దక్షిణాఫ్రికా పైనే గేల్ 117 పరుగులు సాధించాడు. ►ఇక ప్రపంచ క్రికెట్లో టీ20ల్లో అత్యంత వేగవంతంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా చార్లెస్ నిలిచాడు .అంతకుముందు ప్రోటీస్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. విండీస్ భారీ స్కోర్ ఇక చార్లెస్ అద్భుత ఇన్నింగ్స ఫలితంగా విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. -
తెలివైన క్రికెటర్.. 'క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'
సౌతాఫ్రికా బౌలర్ అన్రిచ్ నోర్ట్జే తెలివైన క్యాచ్ అందుకున్నాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్‌లు అరుదుగా చూస్తుంటాం. మాములుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు క్యాచ్‌లు అందుకోవడంలో విన్యాసాలు చేస్తుంటారు. క్యాచ్ పట్టే క్రమంలో బ్యాలెన్స్ తప్పితే బంతిని గాల్లోకి విసిరి బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్‌లు తీసుకోవడం చూస్తుంటాం. కానీ నోర్ట్జే కాస్త కొత్తగా, తెలివిగా ఆలోచించాడు. బ్యాటర్ బంతిని బారీ షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్జ్టే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్‌ను ఒడిసిపట్టుకున్నాడు. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్‌గా నోర్ట్జే తీసుకున్న క్యాచ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. నోర్ట్జే ఆలోచన కాస్త కొత్తగా ఉండడంతో ''క్యాచ్‌లందు ఈ క్యాచ్ వేరయా'' అన్న క్యాప్షన్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు పేర్కొన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో కాట్రల్, స్మిత్ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్, హోస్సేన్, షెపర్డ్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్ కెప్టెన్ రోవమన్ పావెల్(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. @AnrichNortje02 Become The Superman What a catch 🔥 @DelhiCapitals #SAvsWIt20 📹 by FanCode pic.twitter.com/S3JntWA8qd — Mr Perfect 🤟🏻 (@starmanjeet007) March 25, 2023 చదవండి: బీచ్‌లో పరిగెడితే ఆట పట్టించారు.. కట్‌చేస్తే 'పరుగుల రాణి'గా నెదర్లాండ్స్ కలను నాశనం చేసిన జింబాబ్వే -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.