
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్ అందింది. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు జాన్సన్ చార్లెస్ కోల్‌కతా జట్టుతో కలిశాడు. కాగా కేకేఆర్ ఆటగాడు, బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో దాస్ స్థానాన్ని చార్లెస్‌తో కేకేఆర్ భర్తీ చేసింది. ఇక చార్లెస్ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటు దక్కే ఛాన్స్ ఉంది. కాగా టీ20 విధ్వంసకర ఆటగాళ్లలో చార్లెస్ ఒకడు.
ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ వెస్టిండీస్ తరపున 41 టీ20ల్లో 971 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 224 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ కరీబియన్ 5600 పరుగులు చేశాడు. చార్లెస్ వంటి పవర్ హిట్టర్ జట్టులో చేరడం కేకేఆర్‌కు మరింత బలం చేకూరుస్తుంది.
పంజాబ్‌తో మ్యాచ్‌కు కేకేఆర్ తుది జట్టు(అంచనా)
జాన్సన్ చార్లెస్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
చదవండి: IPL 2023-Mark Wood: లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!