కోల్‌కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్‌కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్‌రైడర్స్ 5 వికెట్ల తేడాతో
పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు.
ధావన్ ఫిఫ్టీతో...
కోల్‌కతా పవర్‌ప్లేలోనే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్‌స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది.
జితేశ్, ధావన్ నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్‌ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది.
కెప్టెన్ ఇన్నింగ్స్...
జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్‌కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్‌ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్‌కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్‌స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్‌ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139.
బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్‌ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182.
వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178.
బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్‌స్టోన్ 2–0–27–0, హర్‌ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2.
Comments
Please login to add a commentAdd a comment