IPL 2023- KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ చేరనున్నాడు. బంగ్లా ఆటగాడు లిటన్‌దాస్ కుటుంబ సభ్యుల ఆరోగ్య అత్యవసర పరిస్థితి దృష్ట్యా స్వదేశం పయనమయ్యాడు. దీంతో ఐపీఎల్-2023 మిగతా సీజన్ కోసం అతని స్థానంలో చార్లెస్‌ను రూ.50 లక్షల కనీస ధరకు కోల్‌కతా తీసుకుంది. ఈ మేరకు కేకేఆర్ గురువారం ప్రకటన విడుదల చేసింది.
బిగ్ హిట్టర్
‘‘ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ దృష్ట్యా లిటన్‌దాస్ ఏప్రిల్ 28న స్వదేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అతడు, అతడి కుటుంబ సభ్యులు బాగుండాలని మేము ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో చార్లెస్‌ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా జాన్సన్ చార్లెస్ విండీస్ తరఫున 41 అంతర్జాతీయ టి20లు ఆడి.. 971 పరుగులు చేశాడు.
అదే విధంగా.. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు గెలిచిన కరీబియన్ జట్టులో చార్లెస్ సభ్యుడుగా ఉన్నాడు. అంతేగాక ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పొట్టిఫార్మాట్లో మొత్తంగా 224 మ్యాచ్‌లు ఆడి.. 5600 పరుగులు సాధించాడు. బిగ్ హిట్టర్‌గా పేరొందిన చార్లెస్ రాకతో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది.
రైజర్స్‌పై విజయం
ఇదిలా ఉంటే.. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌లో నాలుగో గెలుపు నమోదు చేసి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
చదవండి: డెత్ ఓవర్లలో 'కింగ్' అనిపించుకుంటున్న రింకూ సింగ్
నేను బాగా ఆడినపుడే.. నాకు క్రెడిట్ దక్కకుండా చేస్తాడు: ఇషాన్ కిషన్
Comments
Please login to add a commentAdd a comment