ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి రింకూ సింగ్ కేకేఆర్‌ను విజయతీరాలకు చేర్చాడు. 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ నితీష్ రాణా 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్ (42), రింకూ సింగ్(21) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు.
నాలుగో వికెట్ డౌన్
124 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 116/3
11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 92/2
11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(30), వెంకటేశ్ అయ్యర్(7) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
64 పరుగులు వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జాసన్ రాయ్.. హర్‌ప్రీత్ బార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
38 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన గుర్బాజ్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 10/1
180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో రాయ్, గర్భాజ్ ఉన్నారు.
అదరగొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ 180 పరుగులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్‌ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు.
17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 139/6
17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో షారుక్ ఖాన్, సామ్ కర్రాన్ ఉన్నారు.
11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 93/3
11 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(37), జితేష్ శర్మ(20) పరుగులతో ఉన్నారు.
8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 70/3
8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(31), జితేష్ శర్మ(4) పరుగులతో ఉన్నారు.
మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
లైమ్ లివింగ్ స్టోన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
రెండో వికెట్ డౌన్
29 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రాజపాక్స డకౌటయ్యాడు. క్రీజులోకి లివింగ్ స్టోన్ వచ్చాడు. 4 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 32/2
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్.. హర్షిత్ రాణా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్
ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. షార్ట్ స్థానంలో రాజపాక్స తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడనుంది.
తుది జట్లు
పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్
కోల్‌కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment