సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లోనే చార్లెస్ సెంచరీ సాధించాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు.
వెస్టిండీస్ ప్రపంచ రికార్డు..
కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్స్‌లు నమోదు చేసింది. తద్వారా విండీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆఫ్గానిస్తాన్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది.
2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ కూడా 22 సిక్స్‌లు బాదింది. ఆ తర్వాతి స్ధానంలో కూడా విండీస్‌నే ఉంది. 2016లో భారత్‌తో జరిగిన టీ20లో విండీస్ 21 సిక్స్‌లు కొట్టింది.
చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 23 బంతుల్లోనే!
Comments
Please login to add a commentAdd a comment