most sixes
-
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్
విండీస్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా హార్డ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో 3 సిక్సర్లు బాదిన సూర్యకుమార్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌ను అధిగమించాడు. 50 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత స్కై ఖాతాలో 104 సిక్సర్లు ఉండగా.. గేల్ పేరిట 103 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో విండీస్ ఆటగాడు ఎవిన్ లెవిస్ 111 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. లెవిస్, స్కై, గేల్ల తర్వాత కివీస్ కొలిన్ మున్రో (92), ఆరోన్ ఫించ్ (79) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ స్కై నాలుగో స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో ఐదో టీ20లో 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్.. 50 ఇన్నింగ్స్‌ల అనంతరం 1841 పరుగులు చేసి ఈ విభాగంలో విరాట్ కోహ్లి (1943), బాబర్ ఆజమ్ (1942), మహ్మద్ రిజ్వాన్ (1888) తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో స్కై తర్వాత కేఎల్ రాహుల్ (1751) ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన ఫ్లోరిడా పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఐదో టీ20లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఫలితంగా భారత్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను (2-3) కూడా కోల్పోయింది. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను తృటిలో చేజార్చుకుంది. -
IND VS WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న చహల్
టీమిండియాతో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో విండీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను విండీస్‌కు అప్పగించింది. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా ఉండింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్ స్పిన్నర్ ఐష్ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్ తర్వాత ఆదిల్ రషీద్ (119) ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై బ్యాటర్ల నిర్లక్ష్యం, పసలేని బౌలింగ్ కారణంగా భారత్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రొమారియో షెఫర్డ్ (4/31) భారత్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి గెలిచింది. బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగారు. ఈ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్‌ను కోల్పోయింది. -
చెత్త ఫామ్...అయినా రికార్డులు సృష్టిస్తున్న హిట్ మ్యాన్
-
CSK VS KKR: సిక్సర్ల సునామీ.. రికార్డు బద్దలు
ఐపీఎల్-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. ఈ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదిన సీఎస్కే.. గతంలో తమ పేరిట ఉన్న 17 సిక్సర్ల రికార్డును అధిగమించింది. గతంలో నాలుగుసార్లు 17 సిక్సర్లు బాదిన సీఎస్కే.. నిన్నటి మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆ మార్కును దాటింది. ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే చివరిసారిగా 17 సిక్సర్లు బాదింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే, శివమ్ దూబే చెరో 5 సిక్సర్లు బాదగా.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే తలో 3, జడేజా 2 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఆర్సీబీ రికార్డుల్లోకెక్కింది. ఈ జట్టు 2013లో పూణే వారియర్స్‌పై 21 సిక్సర్లు బాదింది. 10 సీజన్లు అయిపోవస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డు ఆర్సీబీ పేరిటే ఉంది. కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే మరో రికార్డు కూడా సాధించింది. కేకేఆర్‌పై అత్యధిక టీమ్ స్కోర్ (235/4) నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ (228/4) పేరిట ఉండేది. ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో జేసన్ రాయ్ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
SRH VS MI: ముంబై ఇండియన్స్ బౌలర్ చెత్త రికార్డు.. వికెట్లు తీశాడనే కానీ..!
ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసిన చావ్లా.. తన స్పెల్ ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా అన్ వాంటెడ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ క్యాష్ రిచ్ లీగ్‌లో 170 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. రికార్డు స్థాయిలో 185 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఐపీఎల్లో మరే ఇతర బౌలర్ ఇన్ని సిక్సర్లు ఇవ్వలేదు. చావ్లా తర్వాత రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ 182 సిక్సర్లు, సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (180), లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా (176), రాజస్థాన్ ఆల్‌రౌండర్ అశ్విన్ (173) అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న వారిలో ఉన్నారు. కాగా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చావ్లా ధారాళంగా పరుగులు (4-0-43-2) సమర్పించుకున్నప్పటికీ ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నప్పటికీ మూకుమ్మడిగా సత్తా చాటారు. చదవండి: IPL 2023: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! అతడెవరో కాదు.. -
RCB VS CSK: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యధికం
ఐపీఎల్-2023లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారుతుండటం చూస్తూ ఉన్నాం. నిన్న (ఏప్రిల్ 17) చెన్నై-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఇది పరాకాష్టకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు బాదారు. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. డెవాన్ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమై, 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో డుప్లెసిస్ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌ల కారణంగా పరుగుల ప్రవాహం పారిన ఈ మ్యాచ్‌లో ఓ ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి ఏకంగా 33 సిక్సర్లు (సీఎస్కే 17, ఆర్సీబీ 16) బాదారు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ ఇదే. ఇన్ని సిక్సర్లు ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే. 2018 సీజన్లో ఇదే జట్ల ( చెన్నై-ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి 33 సిక్సర్లు నమోదు కాగా.. 2020 సీజన్లో రాజస్థాన్- చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. అత్యధిక సిక్సర్లు నమోదైన ప్రతి సందర్భంలో చెన్నై భాగంగా ఉంది. -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ప్రపంచ రికార్డు సమం!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 258 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 39 బంతుల్లోనే చార్లెస్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదుర్కొన్న చార్లెస్ 118 పరుగులు చేశాడు. అతడు ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. చార్లెస్‌తో పాటు ఓపెనర్ కైల్ మైర్స్ 51 పరగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరిలో షెపర్డ్ 18 బంతుల్లో 41) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రోటీస్ బౌలరల్లో జానెసన్ మూడు వికెట్లు,పార్నెల్ రెండు వికెట్లు సాధించారు. వెస్టిండీస్ ప్రపంచ రికార్డు.. కాగా ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 22 సిక్స్‌లు నమోదు చేసింది. తద్వారా విండీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆఫ్గానిస్తాన్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ కూడా 22 సిక్స్‌లు బాదింది. ఆ తర్వాతి స్ధానంలో కూడా విండీస్‌నే ఉంది. 2016లో భారత్‌తో జరిగిన టీ20లో విండీస్ 21 సిక్స్‌లు కొట్టింది. చదవండి: WI vs SA: వెస్టిండీస్ క్రికెటర్ విధ్వంసకర శతకం.. కేవలం 23 బంతుల్లోనే! -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా స్టోక్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ తన మొదటి సిక్స్‌తో ఈ రికార్డును తన పేరిట లిఖించకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఇంగ్లండ్ హెడ్ కోచ్ మెకల్లమ్ పేరిట ఉండేది. తన కెరీర్లో 101 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్107 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో మెకల్లమ్ రికార్డును స్టోక్స్ బ్రేక్ చేశాడు. కాగా స్టోక్స్ ఇప్పటివరకు 90 మ్యాచుల్లో 108 సిక్స్‌లు కొట్టాడు. ఇక తర్వాత స్థానాల్లో ఆడమ్ గిల్ క్రిస్ట్ (100), క్రిస్ గేల్(98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ 384 పరుగుల ముందంజలో ఉంది. కాగా టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్ వన్డే తరహాలో ఆడుతోంది. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. Most Test Sixes: 109 BEN STOKES 🏴 (164 innings) 107 Brendon McCullum 🇳🇿 (176) 100 Adam Gilchrist 🇦🇺 (137) 98 Chris Gayle 🏝️ (182) 97 Jacques Kallis 🇿🇦 (280) 91 Virender Sehwag 🇮🇳 (180) 88 Brian Lara 🏝️ (232) 87 Chris Cairns 🇳🇿 (104)#NZvENG #NZvsENG — Fox Sports Lab (@FoxSportsLab) February 18, 2023 -
సూర్యకుమార్ యాదవ్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు సఫారీల బ్యాటర్ల భరతం పట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. కాగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. చాహర్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాటర్లలో కేఎల్ రాహుల్(56 బంతుల్లో 51 నటౌట్), సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 50 పరుగులు నటౌట్) రాణించారు. మరోసారి అదరగొట్టిన సూర్య.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి అదరగొట్టాడు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఆరంభంలో భారత్ తడబడింది. ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మూడు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సూర్య.. తన ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లగా మలిచాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 33 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 పరుగులు సాధించాడు. అఖరి వరకు క్రీజులో నిలిచి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిజ్వాన్ రికార్డు బద్దలు కొట్టిన సూర్య ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సూర్య కుమార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా సూర్య రికార్డులకెక్కాడు. 2022 ఏడాదిలో ఇప్పటి వరకు ఈ ముంబైకర్ మొత్తం 45 సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు పాక్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో రిజ్వాన్ 42 సిక్సర్లు కొట్టాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో రిజ్వాన్‌ను రికార్డును సూర్య బద్దలు కొట్టాడు. అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా స్కై నిలిచాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అతడు 732 పరుగులు సాధించాడు. అంతకుముందు ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 2018 ఏడాదిలో ధావన్ 689 పరుగులు చేశాడు. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. కరోనా నుంచి కోలుకున్న షమీ -
‘యూనివర్సల్ బాస్ ఖాతాలో మరో రికార్డ్’
నాటింగ్‌హామ్: వెస్టిండీస్ విధ్వంకసర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరో రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు(39) కొట్టిన ఆటగాడిగా నయా రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ 2019లో భాగంగా స్థానిక ట్రెంట్ బ్రిడ్జ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత అందుకున్నాడు. పాక్ బౌలర్ హసన్ అలీ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్(37) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును గేల్ అధిగమించాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రికీ పాంటింగ్(31), బ్రెండన్ మెకల్లమ్(29), హెర్షల్ గిబ్స్(28), జయసూర్య, సచిన్ టెండూల్కర్(27)లు తరువాతి స్థానాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించడంతో వన్డేల్లో వరుసగా ఆరో అర్దసెంచరీ సాధించిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో వరుసగా అత్యధిక అర్దసెంచరీలు సాధించిన ఆటగాడిగా మియాందాద్(9) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఇదే ఊపులో గేల్ మరో రికార్డుపై కన్నేశాడు. ప్రపంచకప్‌లో విండీస్ దిగ్గజం లారా (1,225) చేసిన పరుగుల్ని గేల్ (944) అధిగమించే అవకాశముంది. -
గేల్ ధాటికి కొట్టుకపోయిన ఆఫ్రిది రికార్డు
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ నయా రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు(488) సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న అత్యధిక (476) సిక్సర్ల రికార్డును గేల్ చెరిపివేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్(398), శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య(352), టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (349), సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని (348)లు తరువాతి స్థానాలలో ఉన్నారు. గేల్ మెరిసినా.. మ్యాచ్ గెలవలేదు గేల్ సిక్సర్లు మైదానం బయట పడటంతో ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గేల్ (135; 129 బంతుల్లో 3ఫోర్లు, 12 సిక్సర్లు) వన్డే కెరీర్లో 24వ శతకం నమోదు చేశాడు. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు జాసన్ రాయ్(123; 85 బంతుల్లో 15ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్(102; 97 బంతుల్లో 9ఫోర్లు)లు శతకొట్టారు. దీంతో మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 361 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేదించింది. -
ముంబై ఇండియన్స్ బెస్ట్.. సన్ రైజర్స్ లాస్ట్!
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2017 చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌ను స్వల్ప స్కోరుకే కట్టడిచేసి విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో 117 సిక్సర్లు నమోదు చేసి అగ్రస్థానం ఆక్రమించగా, సన్ రైజర్స్ అట్టడుగున నిలిచింది. ఓవరాల్‌గా అన్ని జట్లు కలిపి 705 సిక్సర్లు సాధించాయి. గతేడాది (638) కంటే 67 సిక్సర్లను ఆటగాళ్లు ఈ సీజన్లో రాబట్టారు. ముంబై తర్వాత 92 సిక్సర్లతో గుజరాత్ లయన్స్, 89 సిక్సర్లతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 88 సిక్సర్లు, ఢిల్లీ డేర్ డెవిల్స్ 87 సిక్సర్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 87 సిక్సర్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు75 సిక్సర్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 70 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్‌లు అత్యధికంగా 26 సిక్సర్లతో సంయుక్తంగా తొలిస్థానం దక్కించుకోగా.. యువ సంచలనం రిషబ్ పంత్ 24 సిక్సర్లు, కీరన్ పోలార్డ్ 22 సిక్సర్లు, రాబిన్ ఉతప్ప 21 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.