IPL 2023: Record for Most Sixes Hit in an IPL Match Equalled in RCB vs CSK Clash - Sakshi
Sakshi News home page

RCB VS CSK: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధికం

Published Tue, Apr 18 2023 2:05 PM | Last Updated on Tue, Apr 18 2023 3:23 PM

IPL 2023 RCB VS CSK: Most Sixes In An IPL Match Record Equalled - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో దాదాపు ప్రతి మ్యాచ్‌లో పరుగుల వరద పారుతుండటం చూస్తూ ఉన్నాం. నిన్న (ఏప్రిల్‌ 17) చెన్నై-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో ఇది పరాకాష్టకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 444 పరుగులు బాదారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. డెవాన్‌ కాన్వే (45 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్‌ దూబే (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. ఆర్సీబీ 20 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకే పరిమితమై, 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

ఛేదనలో డుప్లెసిస్‌ (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్‌ (36 బంతుల్లో 76; 3 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ, స్వల్ప వ్యవధిలో ఇద్దరూ ఔట్‌ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌ల కారణంగా పరుగుల ప్రవాహం పారిన ఈ మ్యాచ్‌లో ఓ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ఐపీఎల్‌ రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు కలిసి ఏకంగా 33 సిక్సర్లు (సీఎస్‌కే 17, ఆర్సీబీ 16) బాదారు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్‌ ఇదే. ఇన్ని సిక్సర్లు ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌లో నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే. 2018 సీజన్‌లో ఇదే జట్ల ( చెన్నై-ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిసారి 33 సిక్సర్లు నమోదు కాగా.. 2020 సీజన్‌లో రాజస్థాన్‌- చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. అత్యధిక సిక్సర్లు నమోదైన ప్రతి సందర్భంలో చెన్నై భాగంగా ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement