IPL 2023: Chennai Super Kings Break Record Of Most Sixes In IPL Innings - Sakshi
Sakshi News home page

CSK VS KKR: సిక్సర్ల సునామీ.. రికార్డు బద్దలు

Published Mon, Apr 24 2023 10:53 AM | Last Updated on Mon, Apr 24 2023 11:53 AM

Maximum Number Of Sixes Hit In An Innings By A Team In IPL - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 23) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. ఈ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదిన సీఎస్‌కే.. గతంలో తమ పేరిట ఉన్న 17 సిక్సర్ల రికార్డును అధిగమించింది. గతం‍లో నాలుగుసార్లు 17 సిక్సర్లు బాదిన సీఎస్‌కే.. నిన్నటి మ్యాచ్‌లో ఎట్టకేలకు ఆ మార్కును దాటింది. ఇదే సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే చివరిసారిగా 17 సిక్సర్లు బాదింది.

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రహానే, శివమ్‌ దూబే చెరో 5 సిక్సర్లు బాదగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌, డెవాన్‌ కాన్వే తలో 3, జడేజా 2 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఆర్సీబీ రికార్డుల్లోకెక్కింది. ఈ జట్టు 2013లో పూణే వారియర్స్‌పై 21 సిక్సర్లు బాదింది. 10 సీజన్లు అయిపోవస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డు ఆర్సీబీ పేరిటే ఉంది.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే మరో రికార్డు కూడా సాధించింది.  కేకేఆర్‌పై అత్యధిక టీమ్‌ స్కోర్‌ (235/4) నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై అత్యధిక టీమ్‌ స్కోర్‌ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్‌ (228/4) పేరిట ఉండేది. 

ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 49 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రహానే (29 బంతుల్లో 71 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (21 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), డెవాన్‌ కాన్వే (40 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (20 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఛేదనలో జేసన్‌ రాయ్‌ (26 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (33 బంతుల్లో 53 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినప్పటికీ కేకేఆర్‌ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement