
photo credit: IPL Twitter
ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్ పియూష్ చావ్లా ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌల్ చేసిన చావ్లా.. తన స్పెల్ ఆఖరి ఓవర్‌లో రెండు సిక్సర్లు సమర్పించుకోవడంతో, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న బౌలర్‌గా అన్ వాంటెడ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్
క్యాష్ రిచ్ లీగ్‌లో 170 మ్యాచ్‌లు ఆడిన చావ్లా.. రికార్డు స్థాయిలో 185 సిక్సర్లు సమర్పించుకున్నాడు. ఐపీఎల్‌లో మరే ఇతర బౌలర్ ఇన్ని సిక్సర్లు ఇవ్వలేదు. చావ్లా తర్వాత రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ 182 సిక్సర్లు, సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (180), లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా (176), రాజస్థాన్ ఆల్‌రౌండర్ అశ్విన్ (173) అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న వారిలో ఉన్నారు.
కాగా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చావ్లా ధారాళంగా పరుగులు (4-0-43-2) సమర్పించుకున్నప్పటికీ ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెమారూన్ గ్రీన్ (64 నాటౌట్), తిలక్ వర్మ (37) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో మరో బంతి మిగిలుండగానే 178 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (48), హెన్రిచ్ క్లాసెన్ (36) ఓ మోస్తరుగా రాణించగా.. ముంబై బౌలర్లు పరుగులు సమర్పించుకున్నప్పటికీ మూకుమ్మడిగా సత్తా చాటారు.
చదవండి: IPL 2023: ఫిక్సింగ్ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్! అతడెవరో కాదు..