బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ నయా రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు(488) సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న అత్యధిక (476) సిక్సర్ల రికార్డును గేల్ చెరిపివేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గేల్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్(398), శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య(352), టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (349), సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని (348)లు తరువాతి స్థానాలలో ఉన్నారు.
గేల్ మెరిసినా.. మ్యాచ్ గెలవలేదు
గేల్ సిక్సర్లు మైదానం బయట పడటంతో ఏకంగా నాలుగు సార్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గేల్ (135; 129 బంతుల్లో 3ఫోర్లు, 12 సిక్సర్లు) వన్డే కెరీర్‌లో 24వ శతకం నమోదు చేశాడు. గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు జాసన్ రాయ్(123; 85 బంతుల్లో 15ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్(102; 97 బంతుల్లో 9ఫోర్లు)లు శతకొట్టారు. దీంతో మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 361 పరుగుల భారీ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ చేదించింది.
Comments
Please login to add a commentAdd a comment