
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్, ట్రింబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ భయంకర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ బ్యాటర్, విండీస్ స్టార్ ఓపెనర్ జాన్సన్ చార్లెస్ పెను ప్రమాదం తృటిలో తప్పించుకున్నాడు. మైదానంలో బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు బ్యాటర్లు చాలా జాగ్రత్త వహించాలి.
ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు వ్యతిరేకంగా విభిన్న షాట్‌లు ఆడాలనుకున్నప్పుడు బ్యాటర్లకు కొంచెం తెలివితో పాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఏదో గుడ్డిగా ప్రయోగాలు చేద్దామంటే గాయాల బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు చేసి చాలా మంది ఆటగాళ్లు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా చార్లెస్ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే అదృష్టవశాత్తూ అతడికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఏం జరిగిదంటే?
సెయింట్ లూసియా ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో డ్వేన్ బ్రావో నాలుగో బంతిని ఫుల్ టాస్‌గా సంధించాడు. ఈ క్రమంలో చార్లెస్ బంతిని వికెట్ కీపర్ పై నుంచి పంపేందుకు స్కూప్ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని పూర్తిగా మిస్ అయ్యాడు. ఈ క్రమంలో బంతి వచ్చి అతడి గడ్డానికి తాకింది. బంతి తగిలిన దెబ్బకు అతని హెల్మెట్ ఎగిరి పడింది.
అయితే ఈ సమయంలో తెలివిగా వ్యవహరించిన చార్లెస్.. హెల్మెట్ వికెట్లపై పడకుండా కాలితో తన్నాడు. కాగా వెంటనే ఫిజియో పరిగెత్తు కుంటూ వచ్చి అతడిని పరీక్షించాడు. అతడికి ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియెపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. "మనకు రానిది అవసరమా భయ్యా.. కొంచెం తేడా జరిగింటే ఏంటి పరిస్థితి" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
చదవండి: భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
What just happened!?!
— CPL T20 (@CPL) August 26, 2023
Johnson Charles almost dismissed by his own helmet! @BetBarteronline magic moment!#CPL23 #SLKvTKR #BetBarter pic.twitter.com/Ts6YxZY1m0
Comments
Please login to add a commentAdd a comment