కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో క్వాలిఫియర్-2కు బార్బడోస్ రాయల్స్ ఆర్హత సాధించింది. ఈ లీగ్‌లో భాగంగా బుధవారం ఎలిమినేటర్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌పై 9 వికెట్ల తేడాతో బార్బడోస్ ఘన విజయం సాధించింది. ఫ్లడ్ లైట్స్ అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
నైట్‌రైడర్స్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ మరోసారి సత్తాచాటాడు. 60 బంతులు ఎదుర్కొన్న పూరన్.. 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. అతడితో పాటు జాసన్ రాయ్ 25 పరుగులతో రాణించాడు. డీఎల్‌ఎస్ ప్రకారం రాయల్స్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 60 పరుగులగా నిర్ణయించారు.
చెలరేగిన మిల్లర్..
అనంతరం లక్ష్య చేధనలో బార్బడోస్ స్టార్ ప్లేయయ్, ప్రోటీస్ విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మిల్లర్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఊచకోత ఫలితంగా బార్బడోస్ కేవలం 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
Comments
Please login to add a commentAdd a comment