వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ ప్రయాణం జింబాబ్వే వేదికగా జరుగుతున్న క్వాలిఫయర్స్‌లోనే ముగిసిన సంగతి తెలిసిందే. స్కాట్లాండ్ చేతిలో ఓటమిపాలైన విండీస్ అధికారికంగా వన్డే వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫయర్స్‌లో విండీస్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. జూలై 5న ఒమన్, శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్‌లు ఆడనుంది.
అనంతరం స్వదేశంలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు కరీబియన్ జట్టు సిద్దం కానుంది. దీంతో భారత్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌లను ముందుగానే స్వదేశానికి విండీస్ క్రికెట్ బోర్డు రప్పించింది. ఈ క్రమంలో వీరిద్దరూ ఒమన్, శ్రీలంక జరగనున్న చివరి క్వాలిఫయర్ మ్యాచ్‌లకు దూరమయ్యారు. విండీస్ జట్టు ప్రస్తుతం ట్రినిడాడ్‌లో తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తోంది. వీరిద్దరూ నేరుగా విండీస్ జట్టుతో కలవనున్నారు.
జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ నుంచి ముందుగానే స్వదేశానికి బయలుదేరనున్నారు. వారు కరేబియన్‌కు తిరిగి రానుందున చివరి రెండు సూపర్ సిక్స్ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. భారత్‌తో టెస్టు సిరీస్‌కు వారిపై వర్క్‌లోడ్‌ను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని విండీస్ క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా జూలై 12 నుంచి డెమినికా వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఇక టెస్టు సిరీస్ అనంతరం మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ జట్టు ఆతిథ్య విండీస్‌తో తలపడనుంది.
భారత్‌తో టెస్టులకు వెస్టిండీస్ సన్నహాక జట్టు: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథనేజ్, జెర్మైన్ బ్లాక్వుడ్, ఎన్క్రుమా బోనర్, తగెనరైన్ చంద్రపాల్, రఖీమ్ కార్న్వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, కవెమ్ హాడ్జ్, అకీమ్ జోర్డాన్, జైర్ మెక్అలిస్టర్, కిర్క్ మెకెంజీ, మార్క్వినో మైండ్లీ, అండర్సన్ ఫిలిప్, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్, జోమెల్ వారికన్.
Comments
Please login to add a commentAdd a comment