టీమిండియాతో తొలి వన్డే ఓటమి నుంచి కోలుకోకముందే విండీస్‌కు మరో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. కరోనా బారిన పడ్డ ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేకు ముందు హోల్డర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో తొలి వన్డేకు హోల్డర్ దూరమయ్యాడు. ఇక ఇదే విషయాన్ని టాస్ సమయంలో విండీస్ కెప్టెన్ పూరన్ కూడా దృవీకరించాడు. "దురదృష్టవశాత్తు హోల్డర్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. కాబట్టి మొదటి వన్డేకు దూరమయ్యాడు.
అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు" అని పూరన్ పేర్కొన్నాడు. అయితే అతడు మరో ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్, టెస్టు సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న హోల్డర్ తిరిగి భారత్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు. ఇక తొలి వన్డేలో అఖరి వరకు పోరాడిన విండీస్ మూడే పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం(జూలై24) జరగనుంది.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే:
►వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్
►టాస్: విండీస్- బౌలింగ్
►భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు)
►వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు)
►విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు)
►అర్ధ శతకాలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54)
చదవండి: Shikhar Dhawan- Nicholas Pooran: సెంచరీ చేజారినందుకు బాధగా ఉంది! అసలైన గెలుపు మాదే!
Comments
Please login to add a commentAdd a comment