వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్‌సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్‌సీబీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్‌రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్‌సీబీది. అందుకే కీలకమ్యాచ్‌లో తొలిసారి జూలు విదిల్చింది.
ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది.
ఎందుకంటే మహిళల క్రికెట్‌లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్‌ను మిస్ చేసుకుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం.
సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్‌నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB
— JioCinema (@JioCinema) March 18, 2023
.@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA
— JioCinema (@JioCinema) March 18, 2023
చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్
Comments
Please login to add a commentAdd a comment