ఆ్రస్టేలియా మహిళల ఘన విజయం | Great win for Australia women against Pakistan by 9 wickets | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఆ్రస్టేలియా మహిళల ఘన విజయం

Published Sat, Oct 12 2024 2:19 AM | Last Updated on Sat, Oct 12 2024 7:38 AM

Great win for Australia women against Pakistan by 9 wickets

పాక్‌పై 9 వికెట్లతో జయభేరి 

మహిళల టి20 ప్రపంచకప్‌ 

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా జట్టు మహిళల టి20 ప్రపంచకప్‌లో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్‌ ‘ఎ’లో వరుసగా ‘హ్యాట్రిక్‌’ విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన పోరులో ఆసీస్‌ అమ్మాయిల జట్టు 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. 

టాస్‌ నెగ్గిన ఆ్రస్టేలియా ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన పాకిస్తాన్‌ 19.5 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆలియా రియాజ్‌ (32 బంతుల్లో 26; 3 ఫోర్లు) టాప్‌స్కోరర్‌ కాగా, మిగతా ఎవరూ కూడా కనీసం 15 పరుగులైనా చేయలేకపోయారు. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆష్లే గార్డ్‌నెర్‌ 4, అనాబెల్‌ సదర్లాండ్, జార్జియా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా కేవలం 11 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 83 పరుగులు చేసి గెలిచింది. ఈ గ్రూపులో మూడు విజయాలతో ఆసీస్‌ (6 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement