కీలక పోరులో 9 పరుగులతో ఆసీస్ చేతిలో ఓటమి
మహిళల టి20 ప్రపంచకప్
షార్జా: భారత మహిళల ముందున్న లక్ష్యం 152...అసాధ్యమేమీ కాదు కానీ 47 పరుగులకే టాపార్డర్ అవుట్! ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (47 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు), దీప్తిశర్మ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) భాగస్వామ్యం ఆశలు రేపింది. 25 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి అవుటవడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. గ్రూప్ ‘ఎ’లో ఆదివారం భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓడింది. మొదట ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 40; 5 ఫోర్లు), కెపె్టన్ తాహ్లియా మెక్‌గ్రాత్ (26 బంతుల్లో 32; 4 ఫోర్లు), ఎలైస్ పెరీ (23 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం భారత అమ్మాయిల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడింది.
రాణించిన గ్రేస్ హారిస్
భారత సీమర్ రేణుక ఆరంభ ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ 17 పరుగుల వద్దే వరుస బంతుల్లో బెత్ మూని (2), జార్జియా (0) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ గ్రేస్ హారిస్, కెపె్టన్ తాహ్లియా కుదురుగా ఆడటంతో 10 ఓవర్లలో జట్టు 65/2 స్కోరు చేసింది. ఆష్లే గార్డ్‌నర్ (6) విఫలం కాగా, ఎలైస్ పెరీ ధాటిగా ఆడింది.
హర్మన్ పోరాడినా...
షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (6), జెమీమా రోడ్రిగ్స్ (16) విఫలం అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తిశర్మ నడిపించారు. జట్టు స్కోరును 15.1 ఓవర్లలో వందకు చేర్చారు. అయితే భారీ షాట్‌కు యతి్నంచిన దీప్తిశర్మ బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దీంతో నాలుగో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా...4 పరుగుల చేసిన భారత్ 4 వికెట్లు చేజార్చుకుంది.
పాక్ గెలిస్తేనే... ‘ఎ’ గ్రూప్ నుంచి ఆసీస్ సెమీస్ చేరగా...భారత్, కివీస్ మధ్య రెండో స్థానం కోసం పోటీ ఉంది. నేడు పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణంతో పని లేకుండా మూడు విజయాలతో ఆ జట్టుకు ముందుకు వెళ్లి భారత్ ని్రష్కమిస్తుంది. ఈ మ్యాచ్ ఫలితం తర్వాత కూడా భారత్ రన్‌రేట్ కివీస్‌కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాక్ చేతిలో ఆ జట్టు ఓడిపోతే చాలు. అయితే బలహీనమైన పాక్‌పై కివీస్‌కు ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా మహిళల ఇన్నింగ్స్: హారిస్ (సి) స్మృతి (బి) దీప్తిశర్మ 40; బెత్ మూని (సి) రాధ (బి) రేణుక 2; జార్జియా (ఎల్బీడబ్ల్యూ) (బి) రేణుక 0; తాహ్లియా (స్టంప్డ్) రిచా (బి) రాధ 32; పెర్రీ (సి) సబ్–సజన (బి) దీప్తిశర్మ 32; ఆష్లే గార్డ్‌నెర్ (సి) రాధ (బి) పూజ 6; లిచ్‌ఫీల్డ్ నాటౌట్ 15; అనాబెల్ (బి) శ్రేయాంక 10; సోఫీ రనౌట్ 0; మేగన్ షట్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1–17, 2–17, 3–79, 4–92, 5–101, 6–134, 7–145, 8–145.
బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, శ్రేయాంక 4–0–32–1, పూజ వస్త్రకర్ 3–0–22–1, అరుంధతీ రెడ్డి 3–0–24–0, దీప్తిశర్మ 4–0–28–2, రాధా యాదవ్ 2–0–14–1.
భారత మహిళల ఇన్నింగ్స్: షఫాలీ (సి) అనాబెల్ (బి) ఆష్లే గార్డ్‌నర్ 20; స్మృతి మంధాన (ఎల్బీడబ్ల్యూ) (బి) సోఫి 6; జెమీమా (సి) గార్డ్‌నర్ (బి) మేగన్ షటల్ 16; హర్మన్‌ప్రీత్ నాటౌట్ 54; దీప్తిశర్మ (సి) జార్జియా (బి) సోఫీ 29; రిచా ఘోష్ రనౌట్ 1; పూజ (బి) అనాబెల్ 9; అరుంధతి రనౌట్ 0; శ్రేయాంక రనౌట్ 0; రాధ (ఎల్బీడబ్ల్యూ) (బి) అనాబెల్ 0; రేణుక నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–26, 2–39, 3–47, 4–110, 5–111, 6–139, 7–139, 8–141, 9–141.
బౌలింగ్: మేగన్ షట్ 4–0–25–1, ఆష్లే గార్డ్‌నర్ 4–0–32–1, అనాబెల్ 4–0–22–2, సోఫి మోలినెక్స్ 4–0–32–2, జార్జియా 3–0–22–0, డార్సిబ్రౌన్ 1–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment