కోరీ అండర్సన్ కు అరుదైన గౌరవం | Corey Anderson named event ambassador for 2018 ICC U-19 World Cup | Sakshi
Sakshi News home page

కోరీ అండర్సన్ కు అరుదైన గౌరవం

Published Thu, Oct 5 2017 2:20 PM | Last Updated on Thu, Oct 5 2017 2:20 PM

Corey Anderson named event ambassador for 2018 ICC U-19 World Cup

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోరీ అండర్సన్ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది న్యూజిలాండ్ లో జరగబోయే అండర్ -19 వరల్డ్ కప్ కు గాను అండర్సన్ ను ఈవెంట్ అంబాసిడర్ గా నియమించారు. ఈ మేరకు గురువారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అండర్సన్ ను అండర్-19 వరల్డ్ కప్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించించింది. దీనిలో భాగంగా 16 జట్ల ఆడబోయే మెగా టోర్నమెంట్ లో భవిష్యత్తు క్రికెట్ స్టార్లతో అండర్సన్ భాగస్వామ్యం కానున్నట్లు తెలిపింది. అండర్ 19 వరల్డ్ కప్ లో మరొకసారి ఇలా భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని అండర్సన్ తెలిపాడు. దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు. 2008(మలేషియా), 2010(న్యూజిలాండ్)లో జరిగిన రెండు అండర్ 19 వరల్డ్ కప్ ల్లో అండర్సన్ పాల్గొన్నాడు.

ఇది 12వ అండర్-19 వరల్డ్ కప్ కాగా, న్యూజిలాండ్ మూడోసారి ఆతిథ్యం ఇస్తుంది. వచ్చే సంవత్సరం జనవరి 13నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకూ నాలుగు నగరాల్లో ఏడు వేదికల్లో అండర్ 19 వరల్డ్ కప్ ను నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement