
న్యూజిలాండ్ క్రికెటర్ అండర్సన్ ప్రపంచ రికార్డు
క్వీస్స్టస్ : న్యూజిలాండ్ క్రికెటర్ కోరీ అండర్సన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి.. 18 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అఫ్రిది రికార్డును బద్ధలుకొట్టాడు. 37 బంతుల్లో సెంచరీ చేసిన అఫ్రిది రికార్డు.. ఆండర్సన్ దెబ్బకు మరుగున పడిపోయింది.
క్వీన్స్టన్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అండర్సన్ కేవలం 47 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. అతని విధ్వంసక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ కేవలం 21 ఓవర్లలో 4 వికెట్లకు 283 పరుగులు చేసింది. కాగా 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 37 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. మొత్తానికి ఇన్నాళ్లకు అతని రికార్డు బద్దలైంది.