
లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో తొలి ఛాంపియన్‌గా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఒమెన్ వేదికగా ఆసియా లయన్స్‌తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. వరల్డ్ జెయింట్స్ విజయంలో కేవిన్ పీటర్సన్, కోరీ ఆండర్సన్ కీలకపాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల కోల్పోయి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. కాగా వరల్డ్ జెయింట్స్ బ్యాటర్ కోరీ అండర్సన్ విద్వంసం సృష్టించాడు.
కేవలం 48 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లు ఉన్నాయి. అండర్సన్‌తో పాటు పీటర్సన్(48), బ్రాడ్ హాడిన్(37),సామీ(38) పరుగులతో రాణించారు. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసియా లయన్స్ 8 వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఆసియా లయన్స్ బ్యాటర్లలో సనత్ జయసూర్య(38), మహ్మద్ యూసుఫ్(39), దిల్షాన్(25) పరుగులతో టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో ఆల్బీ మోర్కెల్ మూడు వికెట్ల పడగొట్టగా, మాంటీ పనేసర్ రెండు వికెట్లు సాధించాడు.
చదవండి: Under 19 World Cup: రవి కుమార్ ‘స్వింగ్’.. సెమీస్‌లో యువ భారత్
Comments
Please login to add a commentAdd a comment