తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన 5కె రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ 'రన్ ఫర్ హెల్త్ అంటూ' టీటీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ముఖ్య అతిథి గా పాల్గొని, ప్రసంగించారు. 5కె రన్ కార్యక్రమాన్ని టీటీఏ టీమ్‌తో కలిసి ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి ప్రారంబించారు. టీటీఏ సేవాభావం కలిగిన సంస్థ అని మాతృభూమికి సేవచేయాలనే ఆలోచన తో కదిలిన టీటీఏ సుదీర్ఘకాలం కొనసాగాలన్నారు సుధీర్ రెడ్డి.
ఈ 5కె రన్ కార్యక్రమం గురించి సంస్థ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవా డేస్‌తో పాటు టీటీఏ సాధించిన విజయాలను సంస్థ అడ్వైసర్ మోహన్ రెడ్డి పటోళ్ల వివరించారు. ప్రతి రెండేళ్ల ఒకసారి చేసే టీటీఏ సేవా కార్యక్రమం.. ఇక నుంచి ప్రతి సంవత్సరం చేస్తామని సంస్థ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెద్ది పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల టీటీఏ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీర్ రెడ్డితో పాటు పలువురిని శాలువాతో సన్మానించి మెమెంటోలు అందించారు. ఈ ఈవెంట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందిరని ఆకట్టుకున్నాయి. జుంబా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. కాలేజ్ స్టూడెంట్స్ నృత్య ప్రదర్శన, మణిపూర్ సంప్రదాయ కర్ర ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. ఆద్యంతం ఉత్సహబరితంగా సాగిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
(చదవండి: విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించాలి: జయంత్ చల్లా)
Comments
Please login to add a commentAdd a comment