రారండోయ్‌ వేడుక చూద్దాం | Praja Palana Vijayotsavalu In Tank Bund Road | Sakshi
Sakshi News home page

రారండోయ్‌ వేడుక చూద్దాం

Published Mon, Dec 9 2024 7:04 AM | Last Updated on Mon, Dec 9 2024 7:04 AM

Praja Palana Vijayotsavalu In Tank Bund Road

నేడు ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకలు

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ 

ఎన్టీఆర్ మార్గ్లో డ్రోన్‌ షో 

పెద్ద ఎత్తున బాణసంచా ప్రదర్శన 

సంగీత దర్శకుడు తమన్‌ నేతృత్వంలో మ్యూజికల్‌ నైట్‌

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజులు పాటు ట్యాంక్‌బండ్‌  ఎన్టీఆర్‌ మార్గ్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 

ఐమ్యాక్స్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఎనీ్టఆర్‌ మార్గ్‌లో డ్రోన్‌ ప్రదర్శన, హుస్సేన్‌ సాగర్‌లో పెద్దఎత్తున బాణసంచా ప్రదర్శన, అనంతరం హెచ్‌ఎండీఏ మైదానంలో తమన్‌ నేతృత్వంలో సంగీత కచేరీ,  సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ట్యాంక్‌బండ్, ఎనీ్టఆర్‌ మార్గ్, నెక్లెస్‌ రోడ్డులో ఫుడ్‌స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. 

బహు పసందుగా ఫుడ్‌ స్టాళ్లు    
ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ స్టాళ్లలోని పలు పసందైన వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్‌ హోటల్స్‌ ఫుడ్‌ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యానీ, మొఘలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్‌ చాట్, ఐస్‌క్రీం.. ఇలా వందకు పైగా ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. 

వీటితో పాటు తెలంగాణ వంటకాలు పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్‌ నాటుకోడి చికెన్, పుడ్‌ జాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరమంతా  విద్యుత్‌ దీపాలంకరణతో జిగేమంటోంది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్‌ దీపాలతో తళుక్కుమంటున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement