డల్లాస్ : అమెరికన్ తెలుగు కన్వెన్షన్ వేడుకలను మే 31, జూన్ 1, 2 తేదీల్లో డల్లాస్ లో నిర్వహించడానికి అమెరికా తెలుగు సంఘం(ఆటా), తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(టాటా)లు సంయుక్తంగా
ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. మన కళలు, సంస్కృతిని పరిరక్షిస్తూ యువతలో నైపుణ్యాన్ని, సమాజ సేవని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆటా, టాటాలు కృషి చేస్తున్నాయి. ఆటా, టాటా ఆధ్వర్యంలో డల్లాస్‌లో కొపెల్‌లోని ఫోర్ పాయింట్స్ షేరాటన్‌లో చిన్నారులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించాయి. ఈ పోటీల్లో100 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కమిటీ ఛైర్ మధుమతి వ్యాసరాజు, కో ఛైర్ జ్యోత్స్నవుండవల్లి, సభ్యులు చైతన్యల పర్యవేక్షణలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక పెయింటింగ్ స్కూల్ టీచర్స్ బ్రిందా నవీన్, సవిత నల్లాలు పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. మూడు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో రోషిని బుద్దా, అదితి ఆవుల, క్యాతి గొవకనపల్లిలు తొలిస్థానంలో నిలవగా, శ్రీశ్మ పసుపులేటి, చందన పగడాల, అవనీష్ బుద్దాలు రెండో స్థానంలో నిలిచారు.
జాయింట్ ఎగ్జిగ్యూటివ్ కమిటీ సభ్యులు అజయ్ రెడ్డి, రఘువీరా బండారు, విక్రమ్ జనగాం, సతీష్ రెడ్డి, మహేష్ ఆదిభట్లలు విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. మధుమతి వ్యాసరాజు, జ్యోత్స్న వుండవల్లిలు పోటీల్లో
పాల్గొన్నచిన్నారులు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసీ వాలంటీర్లు దీప్తి సూర్యదేవర, మాధవి లోకిరెడ్డి, సునిత త్రిపురలు ఈ పోటీల నిర్వహనలో తమవంతు కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment