Business Seminar
-
న్యూ జెర్సీలో ఆటా బిజినెస్ సెమినార్, కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్
న్యూ జెర్సీ లో జరిగిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - ఆటా బిజినెస్ సెమినార్ మరియు కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూ జెర్సీ న్యూయార్క్ టీం సాయంతో.. అట్లాంటాలో జరుగనున్న 18th ఆటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించారు. ఆట అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ఎలెక్ట్ జయంత్ చర్ల , పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డి, ఫిలడెల్ఫియా ట్రస్టీ రాజ్ కక్కెర్ల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ATA న్యూజెర్సీ , న్యూయార్క్ టీం - కార్ప్రేట్ చైర్ హరీష్ బథిని, కో చైర్ ప్రదీప్ కట్టా మరియు ఫైనాన్స్ కమిటీ చైర్ శ్రీకాంత్ గుడిపాటి , కో చైర్ శ్రీకాంత్ తుమ్మలతో పాటు రీజనల్ కోరినేటర్లు సంతోష్ కోరం , ధనరాజ్, రీజినల్ డైరెక్టర్ విలాస్ రెడ్డి జంబుల, మహిళల రీజినల్ కో-ఆర్డినేటర్ గీతా గంగుల, తదితరుల సహాయంతో బిజినెస్ సెమినార్ మరియు నిధుల సేకరణను విజయవంతంగా నిర్వహించారు. అట్లాంటాలో జరిగిన ఆటా (ATA) కాన్ఫరెన్స్ కోసం 636k పైగా 175 కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రతిజ్ఞలను సేకరించినట్లు సభ్యులు తెలిపారు. అలాగే న్యూజెర్సీ & న్యూయార్క్ బృందం అట్లాంటా కాన్ఫరెన్స్ కోసం 800K పైగా దాతల ప్రతిజ్ఞలను సేకరించిందని పేర్కొన్నారు. అట్లాంటాలో జూన్ 7 నుండి 9 వరకు జరిగే ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వహకులు పిలుపునిచ్చారు. -
నగరానికి ఇవాంకా.. బిచ్చగాళ్లు ఆ వంక!
సాక్షి, హైదరాబాద్: బిచ్చగాళ్ల కోసం గాలింపు మొదలైంది. కనిపించిన వారి నల్లా పోలీసులు అదుపులోకి తీసుకుం టున్నారు. నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో యాచనను నిషేధిస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై బిచ్చగాళ్ల కోసం గాలించడం, చిక్కిన వారిని ఆనందాశ్రమాలకు తరలించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సు, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా ట్రంప్ రాక నేపథ్యంలో ఆపరేషన్ ‘బెగ్గర్ ఫ్రీ సిటీ’ సాగుతోంది. బుధవారం నగర పోలీసులు దాదాపు 70 మంది బిచ్చగాళ్లను పున రావాస కేంద్రాలకు తరలించారు. మరికొందరికి స్థాని కంగా కౌన్సెలింగ్ ఇచ్చి వారి స్వస్థలాలకు పంపారు. ప్రత్యేక నిఘా... ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసులు బహిరంగ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. రహదారులు, జంక్షన్లు, పార్కులు, ప్రార్థనామందిరాల వద్ద బిచ్చగాళ్ల కదలికల్ని గమనిస్తున్నారు. రహదారులపై కనిపించిన బిచ్చగాళ్ల వివరాలను ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగానికి అందిస్తున్నారు. ఆయా చోట్ల చిక్కిన బిచ్చగాళ్లకు పోలీసులు తొలుత కౌన్సెలింగ్ ఇస్తూ ప్రతిఘటన ఎదురుకాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావడంతోపాటు వాతావరణ మార్పుల నేపథ్యంలో కొందరు బిచ్చగాళ్లు అనారోగ్యానికి గురై కన్నుమూశారని, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిపై దాడులు, హత్యలు సైతం జరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలోని ఆనందాశ్రమాలకు తరలిస్తున్నామంటూ నచ్చజెబుతున్నారు. పని చేస్తే నగదు చెల్లింపు... బిచ్చగాళ్లు మాత్రం ఈ నోటిఫికేషన్లు, ఆపరేషన్లు, సదస్సుల విషయం తమకు తెలియదని వాపోతు న్నారు. భిక్షమెత్తుకోనివ్వకపోతే తమ కడుపు నిండేది ఎలాగంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ ఆశ్రయాల్లో వీరికి ఆహారం, వస్త్రాలు, వైద్యం తదితర సౌకర్యాలు కల్పించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కర్మాగారాల్లో పని చేయడానికి ఆసక్తి చూపినవారికి ఎనిమిది గంటలకు రూ.400 చొప్పున చెల్లిస్తున్నారు. బాండ్ రాసి ఇస్తే ఇళ్లకు ఆసక్తి ఉన్న బిచ్చగాళ్లకు విద్య, వృత్తివిద్యల్లో శిక్షణలు ఇచ్చి నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఎవరైనా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని అనుకున్నా, వారికోసం సంబంధీకులు వచ్చినా మరోసారి బిక్షాటన చెయ్యమంటూ బాండ్ రాయించుకుంటున్నాం. ఈ రకంగా ఇప్పటికే 40 మందిని వారి ఇళ్లకు పంపాం. ఇలా వెళ్లినవారు మళ్లీ నగరంలో బిచ్చమెత్తుతూ చిక్కితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. – వీకే సింగ్, జైళ్ళ శాఖ డీజీ -
అట్లాంటాలో బిజినెస్ సెమినార్‌కు విశేష స్పందన
అట్లాంటా : గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ(జీఏటీఈఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ సెమినార్, తెలంగాణ సాంస్కృతికోత్సవానికి విశేష స్పందన వచ్చింది. అట్లాంటాలో కుమ్మింగ్‌లోని ఫోర్సిత్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరిగింది. గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ, అట్లాంటాలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు. భారతదేశం ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం, అట్లాంటా వ్యాపారవేత్తల మధ్య వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమానికి 250మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటూ పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. సతీష్ చేటి (జీఏటీఈఎస్ చైర్మన్) అతిథులను ఆహ్వానించగా, ప్రశాంతి అసిరెడ్డి ( జీఏటీఈఎస్ ప్రెసిడెంట్) ముఖ్య అతిథులను సెమినార్‌కు వచ్చిన వారికి పరిచయం చేశారు. ఆర్ శ్రీనివాసన్(కాన్సుల్ ఆఫ్ ఇండియన్ కాన్సులేట్) , ప్రొఫెసర్ వి.వెంకట రమణ (హెచ్‌సీయూ), కార్టర్ పాట్టర్సన్లు భారతదేశం, తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు అనే అంశంపై ప్రసంగించారు. ఎన్ఆర్ఐలు భారత్‌లో పెట్టుబడి పెట్టడానికి భారత ప్రభుత్వ పాలసీలు అనూకూలంగా ఉన్నాయని ఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇలాంటి సెమినార్లు నిర్వహించి ఎన్ఆర్ఐలలో చైతన్యం చేస్తున్నందుకుగానూ జీఏటీఈఎస్ను ఆయన అభినందించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా పార్క్, టెక్స్టైల్ పార్క్, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, వేస్ట్ మేనేజ్మెంట్వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, వనరుల గురించి ప్రొఫెసర్ వి.వెంకట రమణ వివరించారు. అట్లాంటాలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాలను కార్టర్ తెలిపారు. అమెరికా ఎకానమీ పటిష్టం చేయడంలో ఇండో-అమెరికన్ల కృషిని ఆయన కొనియాడారు. అట్లాంటాలో వ్యాపారరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న తెలంగాణకు చెందిన కిరణ్ పాశం, మిగతా వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రజాప్రతినిధులు డన్కన్, బ్రాండన్లను జీఏటీఈఎస్ సత్కరించింది. రమేష్ తన మిమిక్రీతో అతిథులను అలరించారు. బుర్రకథ, ఒగ్గుకథ, సమ్మక్క సారక్క నృత్యరూపకం, పేరిణి డ్యాన్స్, లంబాడీ డ్యాన్స్, జానపద నృత్యాలు ఇలా ఎన్నో కార్యక్రమాలను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించినందుకుగానూఈవెంట్ స్పాన్సర్స్ ఇన్ఫోస్మార్ట్, ఈఐఎస్ టెక్నాలజీస్లను జీఏటీఈఎస్ ఈసీ, బోర్డు అభినందించింది. సతీష్ చేటి, శ్రీనివాస్ గంగసాని, నందా చాట్ల, అనితా నేలుట్ల, కిషన్ తాల్లపల్లి, అనిల్ బోడిరెడ్డి, శ్రీనివాస్ ఆవుల, సునిల్ రెడ్డి కూటూరు, రాహుల్ చిక్యాల, రఘురెడ్డి, వేణు పిసికె, శ్రీధర్ నెలవెల్లి, సునిల్ గూటూరు, సురేష్, కే. వేలమ్, తిరుమల్ పిట్టల సమిష్టి సహకారంతో జీఏటీఈఎస్ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.