నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా | Woman Messes With Pet Cat While Cutting Its Nails | Sakshi
Sakshi News home page

నువ్వు కొరికితే నేను కూడా కొరుకుతా

Published Sun, Jan 3 2021 1:21 PM | Last Updated on Sun, Jan 3 2021 4:47 PM

Woman Messes With Pet Cat While Cutting Its Nails - Sakshi

వీడియో దృశ్యాలు

న్యూజెర్సీ : పిల్లుల పెంపకం అంటే అంత వీజీ కాదు! అవి చేసే అల్లరి మనకు ముద్దుగా అనిపించినా.. కొన్ని సార్లు పంజా విసిరి మన రక్తం కళ్ల చూస్తాయి. న్యూజెర్సీకి చెందిన షర్లిన్‌ కన్‌సుయేగ్రా అనే మహిళకు అలాంటి పరిస్థితే ఎదురైంది. తన పెంపుడు పిల్లి గోర్లతో చేయిపై చీరింది. దీంతో ఆమె దాన్ని గోర్లు కత్తిరించటానికి పూనుకుంది. పిల్లికి గోర్లు కత్తిరిస్తున్న దృశ్యాలను వీడియో తీసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ నువ్వు నన్నెంత కొరికినా లెక్కచేయను. నువ్విలాగే బరుకుతూ ఉంటే నీ గోళ్లను కత్తిరిస్తూనే ఉంటా(చేతిలో గాట్లు చూపిస్తూ). నీకు బరకటం ఇష్టమా?. ( కాపాడాడు, కానీ చెంప చెళ్లుమనిపించాడు)

నీకేం కాదు. నాకు తెలుసు. నువ్విలా బరుకుతూ.. బరుకుతూ ఉంటే ఇలానే చేస్తుంటా. (పిల్లి పళ్లు చూపెడుతూ ‘హిస్‌స్‌’ అంటుంది. ఆమె కూడా హిస్‌స్‌ అంటుంది. ఆవెంటనే.) నేను కూడా నీలాగా అనగలను. నువ్వు నన్ను కొరికితే నేను కూడా నిన్ను కొరుకుతా’’ అంటూ పిల్లిని భయపెట్టి దాని గోళ్లను కత్తిరించింది. ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement