బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్న ఆత్మీయ సదస్సుల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఎడిసన్‌లో ఐటీ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొని, ప్రసంగించారు. ఐటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు బండి సంజయ్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు. ఇక అమెరికాలోని పలు నగరాల్లో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల పట్ల బండి సంజయ్ స్సందించారు. ఈ సమావేశాలకు హాజరుకావటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
(చదవండి: అమెరికాలో తెలుగు భాషకున్న స్థానం అంత ఇంత కాదు!: డా ప్రసాద్ తోటకూర)
Comments
Please login to add a commentAdd a comment