వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. న్యూజెర్సీలో సంబరాలు | NRI Celebrates YSRCP Victory In New Jersey | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభంజనం.. న్యూజెర్సీలో సంబరాలు

Published Wed, May 29 2019 11:51 PM | Last Updated on Wed, May 29 2019 11:51 PM

NRI Celebrates YSRCP Victory In New Jersey - Sakshi

న్యూజెర్సీ :  తాజాగా జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రపంచం నలుమూలలా ఉన్న వైఎస్సార్‌ అభిమానులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్నారైలు  విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను రాజన్న కంటే ఇంకా అద్భుతం గా పరిపాలిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎన్నారై పాల బానోజి రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ అత్యధిక మెజారిటీతో గెలవడం ఆనందంగా ఉందన్నారు. తొమ్మిదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడుతూనే ప్రజా సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను చూసి చలించిపోయానన్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందన్నారు. వైఎస్‌ జగన్‌ కష్టాన్ని ప్రజలు గ్రహించి ఆయనను గుండెల్లో చేర్చుకున్నారని తెలిపారు. ఈ ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ మళ్లీ రాజన్న రాజ్యం తీసుకోస్తారని ధీమా వ్యక్తం చేశారు. యువనాయకుడి అందరు సహకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement