
ఫ్లోరిడా : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి 151 అసెంబ్లీ , 22 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని అఖండ విజయం సాధించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సౌత్ ఫ్లోరిడా (మియామీ) లోని ఎన్నారై విభాగం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మార్ఖం పార్క్‘ లో ఎన్నారై టీం రెడ్డి జై రెడ్డి, రెడ్డి సునీత రెడ్డి, కాకుమాని వెంకట కృష్ణ రెడ్డి, చేమూరు భాస్కర్ రెడ్డి, దుంప హరినాధ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, గూడా కృష్ణమోహన్ రెడ్డి, సుమన్ కోడెబోయిన, పొట్టిపాటి రామా రెడ్డి, గొట్లూరు ప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఈ విజయోత్సవ సంబరాల్లో పాల్గొని ‘జై జగన్... జోహార్ వైఎస్సార్ ‘ నినాదాలతో హోరెత్తించారు. స్వీట్లు పంచుకొని, కేకు కోసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
ఆనాటి కాగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ పార్టీ ఎన్ని కష్టాలకు గురిచేసినా వైఎస్ జగన్ ఎదురొడ్డి ఒక యోధుడిలా పోరాడారని, ఆయనలో ఆ పోరాటతత్వం, ప్రజల పట్ల ప్రేమ, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి, మాట ఇస్తే మడమ తిప్పని లక్షణమే ప్రజలకు మరింత దగ్గర చేసిందని కమిటీ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. తమ నాయకుడి పదేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలాన్నిఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారాని, ప్రజలు జగన్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఖచ్చితంగా న్యాయం చేస్తారని, నవరత్నాలతో పేదల జీవితాలు బాగుపడతాయని, వైఎస్సార్ పాలనను మైమరిపించేలా జగన్ పాలన ఉండబోతుందని కమిటీ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment