మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్‌ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్‌ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.
డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్‌ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్‌లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు.
ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్‌ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్‌ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు.
డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్‌ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు.
రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్‌రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment