దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడకలు అమెరికాలోని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమ్మర్ పార్కులో సమావేశమైన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సుమారు 150 మంది వరకు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరైన వెంకట్‌రెడ్డి లింగారెడ్డితో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సోసైటీకి నుంచి కందిమళ్ల సత్య, ఏ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటం ముందు దీపాలను ఆర్‌వి రెడ్డి దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ, శివ దేశూ, శ్రీజన్, శేషు, ఆడి, శశాంక్, శివారెడ్డి, రామకాంత్, భూపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లల కోసం సరదా కార్యక్రమాలు నిర్వహించారు.
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
Published Mon, Jul 12 2021 12:13 PM | Last Updated on Mon, Jul 12 2021 12:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment