Dr ys rajasekhar reddy
-
దివంగత మహానేత డా.వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్
-
డాలస్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
-
డాలస్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ రక్తదాన శిబిరం
డాలస్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైయస్సార్ 13వ వర్ధంతి సందర్బంగా అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయం తో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. డాక్టర్ రామి రెడ్డి బూచిపూడి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం రాజన్నను స్మరించుకుంటూ ఈ శిబిరం ఏర్పాటు చేస్త్నున్నందుకు అమెరికన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు వైఎస్సార్ అభిమానులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రవి ఆరిమండ, రమణ్ రెడ్డి క్రిష్టపాటి, మని అన్నపురెడ్డి, రమణ పుట్లూర్, జయచంద్ర రెడ్డి, సుధాకర రెడ్డి, భాస్కర్ గండికోట, కృష్ణ రెడ్డి కోడూరు, దర్గా నాగిరెడ్డి, ఫాల్గుణ రెడ్డి, ప్రసాద్ చొప్ప, వీరా రెడ్డి వేముల, మోహన్ మల్లంపాటి, రాజేంద్ర పోలు, సుబ్బా రెడ్డి కొండ్రు, ఉమా కుర్రి, సురేష్ పులి, చెన్నారెడ్డి క్రోవి , మల్లిఖార్జున్ మురారితో సహా పలువురు వైఎస్సార్ అభిమానులు, డాలస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ రక్త దాన శిబిరంలో చైతన్య కుమార్ రెడ్డి, జయచంద్ర గాజులపల్లి, కార్తీక్ ధర్మానాల, మోహన్ మల్లంపాటి, మోహన్ రెడ్డి పులగం, నాగేశ్వర గంట, నవీన్ కుమార్ రాజు అడ్డలూరి, పార్థసారథి గొర్ల, ప్రసాద్ భీమవరపు, రాఘవ రెడ్డి దాట్ల, రాంబాబు శొంఠి, రాము తవుతూ, శివచంద్ర రెడ్డి పల్లె, శివశంకర రెడ్డి వల్లూరు, సుభాష్ సురు, సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డివారి, స్వామినాథన్, ఉజ్వల్ కుమార్ వేమన, ఉమా కుర్రి, వీర లేవక, వీరా రెడ్డి వేముల, వీరవెంకట సత్య పోతంశెట్టి, వెంకట రెడ్డి శీలం, యుగంధర్ తిప్పిరెడ్డి తో పాటుగా పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేశారు. -
73వ వైఎస్ఆర్ జయంతి వేడుకలపై స్పెషల్ స్టోరీ
-
జననాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
మన్రో,న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్ చరిత్రను పరిశీలిస్తే రాజశేఖరరెడ్డికి ముందు , రాజశేఖరరెడ్డికి తర్వాత అనే విధంగా ఆయన పరిపాలన చేశారని ప్రవాస భారతీయులు అన్నారు. ఒక రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ల తర్వాత కూడా ఇంత మంది గుర్తు పెట్టుకుంటున్నారంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థం అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని మన్రోలో వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి హాజరైన వారు వైఎస్సార్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని , తమ జీవితంలో వైఎస్ఆర్ చూపిన ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ బాధ్యుడు ఆళ్ల రామిరెడ్డి మాట్లాడుతూ న్యూజెర్సీలో 2010లో వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలను అమెరికాలో 16 స్టేట్స్లో 19 నగరాల్లో ఘనంగా నిర్వహించామని తెలిపారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, ప్రేమ, భక్తితోనే తాము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీని ప్రజలెవరు మర్చిపోలేరని వైఎస్ఆర్ స్నేహితుడు డాక్టర్ కే రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చాయన్నారు. 60 ఏళ్లు దాటిన తర్వాత రాజకీయాల్లో కొనసాగడం అనవసరమని తనతో వైఎస్ఆర్ తనతో ఎప్పుడూ అంటుండే వారని అనుకోకుండా 60 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయారంటూ ఆనాటి జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. డాక్టర్ వైఎస్సార్ లాంటి నాయకులు మళ్లీ మళ్లీ భారత దేశంలో పుట్టాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ రాఘవరెడ్డి అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరికీ, ముఖ్యంగా పేదలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. వైఎస్ఆర్ బతికుంటే అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ ఎంతో ముందుకు వెళ్లి ఉండేదని అభిప్రాయపడ్డారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని నమ్మిన మహానేత రాజశేఖరరెడ్డి అని పి శ్రీకాంత్‌రెడ్డి . జలయజ్ఞం పేరుతో అనేక సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారని తెలిపారు. పోలవరం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. -
షికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి వేడకలు అమెరికాలోని షికాగో నగరంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని హమ్మర్ పార్కులో సమావేశమైన ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు సుమారు 150 మంది వరకు ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరైన వెంకట్‌రెడ్డి లింగారెడ్డితో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సోసైటీకి నుంచి కందిమళ్ల సత్య, ఏ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటం ముందు దీపాలను ఆర్వి రెడ్డి దీపాలను వెలిగించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ, శివ దేశూ, శ్రీజన్, శేషు, ఆడి, శశాంక్, శివారెడ్డి, రామకాంత్, భూపాల్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజన ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లల కోసం సరదా కార్యక్రమాలు నిర్వహించారు. -
‘108’కు సుస్తీ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పేదల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన్న ఎన్నో సంక్షేమ పథకాలకు ఆయన మరణానంతరం వచ్చిన పాలకులు పథకం ప్రకారం తూట్లు పొడిచారు. పేదల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, 108 పథకాలను మహానేత తర్వాత వచ్చిన పాలకులు నిర్వీర్యం చేశారు. నడిరోడ్డుపై రోడ్డు ప్రమాదాలకు గురైన క్షతగాత్రులను క్షణాల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి వారి ప్రాణాలు కాపాడేందుకు రూపొందించిన 108 పథకం ప్రస్తుతం కునారిల్లుతోంది. కాలం చెల్లిన వాహనాలు, ఆరకొర వసతులు ప్రజల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చాయి. ఈ మధ్య జరిగిన సంఘటనను పరిశీలిస్తే ప్రజారోగ్యానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవా.. అని ఆశ్చర్యం వేయక తప్పదు. ఇటీవల మర్రిపూడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 108కి సమాచారం అందడంతో అరగంట తర్వాత అంబులెన్సు వచ్చింది. క్షతగాత్రలకు ఆక్సిజన్ అందించేందుకు చూస్తే 108 అంబులెన్సులో ఆక్సిజన్ లేదు. మరో వాహనం వచ్చినా ఆ వాహనం తలుపులు తేరుచుకొలేదు. ఆక్సిజన్.. సకాలంలో వైద్యం అందక క్షతగాత్రుల్లో ఒకరు మరణించారు. ఇది.. జిల్లాలో ఉన్న అంబులెన్సుల పరిస్థితి. ఇలాంటి సంఘటనలు నిత్యం జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతోందంటే ఆశ్చర్యం వేయక మానదు. మహానేత పాలనలో.. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక 2005లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 108 వాహనాల సేవలను తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్ బతికున్నంతా కాలం కుయ్.. కుయ్.. కుయ్.. అంటూ 108 వాహనాలు రోడ్లపై క్షణాల్లో వాలిపోయేవి. ఆయన మారణానంతరం వాటిని పట్టించుకునే వారు లేక అవి కునారిల్లుతున్నాయి. జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉన్నాయి. మండలానికి కనీసం ఒకటి చొప్పున వాహనం ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 32 అంబులెన్సులనే కేటాయించారు. కొద్ది రోజుల తర్వాత కొన్ని మరమ్మతులకు గురికాగా ప్రస్తుతం వాటిని కుడా లెక్కలోనే చూపుతున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 3 వాహనాలు మాత్రమే జిల్లాకు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. సమస్యలివిగో.. ఒక్కో వాహనంలో ముగ్గురు సాంకేతిక నిపుణులు, ముగ్గురు పెలైట్లు ఉండాలి. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున 24 గంటలూ ముగ్గురు వాహనంలో ఉండాలి. కానీ ప్రతి 108 వాహనానికి ఇద్దకు సిబ్బందిని మాత్రమే నియమించారు. 108 వాహనాల్లో ఆక్సిజన్ కూడా ఉండటం లేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని వాహనాల తలుపులు కూడా సకాలంలో తెరుచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. టైర్లు ఎప్పుడు బరస్టు అవతాయో కూడా అర్థం కావడం లేదు. వాహనాలన్నీ పాతవే. 108 సేవల పేరుతో ప్రజాధనం లక్షల్లో దుర్వినియోగమవుతోంది. తొలుత జీఎంఆర్, ప్రస్తుతం జీవీకే ఈఎంఆర్ఐ సంస్థలు 108 నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాయి. 108 సేవలకుగానూ ఒక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు లక్షా 13 వేల రూపాయలు చెల్లిస్తోంది. -
అనారోగ్యశ్రీ
పేదలందరికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడిచింది. మహానేత మరణం తర్వాత క్రమక్రమంగా ఆరోగ్య శ్రీ పథకంలో కోతలు విధిస్తూ వచ్చింది. వైఎస్ కంటే ముందు ఉన్న చంద్రబాబు హయాంలో ఓ రిక్షా కార్మికుడికి గుండెపోటు వచ్చిందంటే ఇక అంతే సంగతులు. బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే లక్షలు ఖర్చు చేయాల్సిందే. అందుకోసం ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. లేకపోతే వారి ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిం దే. వీరి బాధలను దృష్టిలో ఉంచుకున్న మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో తెల్లకార్డు ఉన్న ప్రతి నిరుపేదకు లక్షల్లో ఖర్చు అయ్యే బైపాస్ సర్జరీ, లాప్రోస్కోప్, కాళ్లు, చేతులు విరిగినప్పుడు అతికించడానికి అయ్యే సర్జరీలు అన్నీ ఉచితంగా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల నిరుపేదలంతా.. తమకేమీ కాదులే, అన్నీ ఆయనే చూసుకుంటారు.. అనే గుండె ధైర్యంతో బతికారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారంతా ఆయనను గుండె ల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. వైఎస్సై తమ దేవుడంటూ నిత్యం కొలుస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో తర్వాత అధికారం చేపట్టిన నేతలు ఈ పథకం పట్ల నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మెల్లమెల్లగా ఈ పథకం నుంచి 133 వ్యాధులను తొలగిం చారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేలా తగిన ఏర్పాట్లు చేయగా ఆ తర్వాత వచ్చిన పాలకులు క్రమక్రమం గా ఈ పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న ఆస్పత్రుల్లో పేదవారికి సరైన సదుపాయాలు సైతం కల్పించడం లేదని రోగులు, ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయం చిన్నారులకు శాపం... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమారెడ్డి పెట్టిన ఆంక్షలు చెవిటి, మూగ పిల్లలు చాలా మందికి శాపంగా పరిణమించా యి. ఈ ఆంక్షల వల్ల రూ. 6లక్షల విలువైన క్లాక్ ఇయర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు కోల్పోయారు. దీని వల్ల వారు శాశ్వతంగా చెవిటి, మూగ వారిగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. వైఎస్ బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే సుమారు 40 వేల మందికిపైగా లబ్ధి పొందగా, ఆయన మరణించిన తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చారు. నిధుల మంజూరులో నిర్లక్ష్యం... వైఎస్ మరణించిన తర్వాత ఆరోగశ్రీ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల వారు ఈ పథకాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా రెండు, మూడు ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్ప ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడా అమలు కావడం లేదు. ఈ పథకంలో పని చేసే సిబ్బందికి కూడా ప్రస్తుతం వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీలో సరిగ్గా వైద్యం అందడం లేదని, సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని రోగు లు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ హయాంలో ఈ పథకం కింద లబ్ధిపొందే వారికి రోగితో పాటు పక్కన ఉన్న వారికి కూడా నాణ్యమైన భోజనం అందించేవారు. కానీ ప్రస్తుతం నాసి రకం భోజనం అందిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. మహానేత ఉండగా అన్ని సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం ఆ సంక్షేమమే కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నందికొట్కూరులో వీస్తున్న ఫ్యాన్ గాలి
మెరవని ‘రత్నం’ లబ్బీకి అసంతృప్తుల సెగ ప్రచారంలో దూసుకుపోతున్న ఐజయ్య సాక్షి, కర్నూలు: అరుదైన ‘బట్టమేక ’ పక్షికి స్థావరమైన నందికొట్కూరు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ రిజర్వుడ్‌గా మారింది. ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో తెలుగుదేశం సతమతమవుతోంది. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఉద్యమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ బలంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానం, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో(1955) నందికొట్కూరు ద్విసభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ఈ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన అయ్యపురెడ్డి, ఎన్‌కె.లింగం విజయం సాధించారు. అంతకుముందు 1952లో కమ్యూనిస్టు పార్టీ నేత చండ్ర పుల్లారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. నందికొట్కూరు శాసనసభకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 8 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. మరో మూడు సార్లు తెలుగుదేశం, రెండు సార్లు ఇండిపెండెంట్లు, ఒకసారి సీపీఐ గెలుపొందింది. 1972లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మద్దూరు సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందడం విశేషం. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వై. ఐజయ్య బరిలో ఉన్నారు. ఈయన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలున్నారు. దివంగత నేత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ గృహాలు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో చాలా మంది లబ్ధిపొందారు. వీరంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫేస్టోను నమ్ముతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్సార్సీపీ క్రీయాశీలక పాత్రను ప్రశంసిస్తూ ఆ పార్టీవెంటే తామంతా అంటూ నడుస్తున్నారు. ఐజయ్యకు అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. -
నత్తనడకన ‘గోదావరి’
మేడ్చల్, న్యూస్‌లైన్ : జిల్లాకు సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టినప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ప్రాణ హిత నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వరకు గోదావరి జలాలను తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. అలాగే గోదావరి జలాలను మేడ్చల్ మీదుగా నగరానికి కూడా తరలించనున్నారు. ఇందుకోసం మండలంలోని గుండ్లపోచంపల్లి పరిధిలోని అయోధ్య చౌరస్తా వద్ద నెల రోజుల క్రితం పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టారు. శామీర్‌పేట్ మండ లం మీదుగా పైపులైన్ రావాల్సి ఉన్నా అక్కడ నిర్మాణం పనులు చేపట్టకుండా అయోధ్య చౌరస్తా నుంచి దూలపల్లి మీదుగా నగరానికి గోదావరి జలాలు తరలించేలా పైపులైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే రోడ్డును తవ్వేయడంతో అయోధ్య చౌరస్తా మీదుగా రాకపోకలు సాగించాల్సిన 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ దారి లేదు... పైపులైన్ నిర్మాణం కోసం అయోధ్య చౌరస్తా వద్ద ఆర్అండ్బీ రోడ్డు తవ్వి ఒకపక్కనుంచి పైపులైన్ వేయాలి. అయితే సదరు కాంట్రాక్టర్ ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్డు వేయకుండా చౌరస్తా వద్ద మొత్తం రోడ్డు తవ్వేసి పైపులైన్ నిర్మాణ పనులు మొదలుపెట్టాడు. దీంతో మేడ్చల్ నుంచి గుండ్లపోచంపల్లికి అలాగే కండ్లకోయ, గౌడవెళ్లి, సుతారిగూడలతో పాటు నగరం నుంచి బాసిరేగడి, జ్ఞానాపూర్, నూతన్‌కల్, బండమాదారం, శ్రీరంగవరం, రాయిలాపూర్, గిర్మాపూర్, మేడ్చల్ నుంచి కుత్బుల్లాపూర్‌లకు వెళ్లేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో సుదూర ప్రాంంతాల నుంచి వచ్చిన భారీ వాహనాలవారు చౌరస్తా నుంచి దారి లేకపోవడంతో తిరిగి వేరే మార్గాల ద్వారా మేడ్చల్ మీదుగా వెళ్లే జాతీయ రహదారిపైకి రావాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రాజన్న బాటలో...
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లా శ్రేణులకు సూచించారు. తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లా నాయకులు జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణంతో పాటు జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ భేటీలో చర్చించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పార్టీని మరింత బలోపేతం చేయాలని, అభివృద్ధి, సంక్షేమం నినాదాలతో ముందుకెళ్లాలని నాయకులకు సూచించారు. సమావేశంలో జిల్లా రైతాంగానికి సంబంధించిన అంశాలపై చాలాసేపు మాట్లాడామని, జిల్లాకు చెందిన అంశాలను జగన్ అడిగి తెలుసుకున్నారని పార్టీ జిల్లా నాయకులు ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణలో ఒక చివర్లో ఉన్న ఖమ్మం జిల్లాకు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు రావడం కష్టంగా ఉన్న నేపథ్యంలో గోదావరి నీటిని ఆ భూములకు తీసుకువచ్చే దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పరిస్థితులపై చర్చిం చినట్లు వెల్లడించారు. సమావేశంలో భాగంగా పార్టీ నిర్మాణం, పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం పార్లమెంటరీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో పాటు జిల్లాకు చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
మంజీరా రాదే?
చేవెళ్ల, న్యూస్‌లైన్: మంజీరా నీటి సరఫరా ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టారు. తనకు సెంటిమెంట్‌గా ఉన్న చేవెళ్ల ప్రజల కోరిక మేరకు వారికి రక్షిత మంచినీటిని అందజేయాలన్న సంకల్పంతో2008వ సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. రూ.20కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పనులను 9నెలల్లో పూర్తిచేసి అందరికీ తాగునీటిని అందిస్తామని ఆ రోజు జరిగిన బహిరంగసభలో సీఎం రాజశేఖర రెడ్డి ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం మొదటి దశ పనులను చకచకా పూర్తిచేసింది. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో అధికారం చేపట్టిన వారు నీటి సరఫరా ప్రాజెక్టును పక్కనపెట్టేశారు. నిర్మాణ పనులు మందగించడంతో పథకం కొనసా... గుతూనే ఉంది. వైఎస్సార్ బతికి ఉంటే ఇప్పటికే మంజీరా నీటి సరఫరా ప్రారంభమై తమకు వేసవిలో తాగునీటికి ఢోకా ఉండకపోయేదని ప్రజలు పేర్కొంటున్నారు. పనులు పూర్తయినా.. రూ.20కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేసి మొదటిదశలో చేవెళ్ల మండలంలోని 18 గ్రామాలకు మంజీరా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. చేవెళ్ల, దేవునిఎర్రవల్లి, న్యాలట, ఎనికెపల్లి, కమ్మెట, గొల్లగూడ, సింగప్పగూడ, ఊరెళ్ల, ఇబ్రహీంపల్లి తదితర గ్రామాలకు నీటిని అందించాలని సంకల్పించారు. శంకర్పల్లి వద్ద సింగాపూర్ గ్రామం వద్దనుంచి పైప్‌లైను, మధ్యమధ్యలో సంపులు, చేవెళ్లలో 90వేల లీటర్ల ఓవర్‌హెడ్ ట్యాంకు, ధర్మాసాగర్ వద్ద సంపు నిర్మాణాలను పూర్తిచేశారు. పనులు గత సంవత్సరం ద్వితీయార్థంలో పూర్తయినా ఈ నాటికీ చుక్కనీరు కూడా సరఫరా కాకపోవడం శోచనీయం. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం త్వరలోనే తాగునీరు అందిస్తామని చెబుతూ వస్తున్నారే తప్ప ఆచరణలో విఫలమవుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఇందిర జలభ్రమ
సాక్షి, రాజమండ్రి : ‘రెక్కలు ముక్కలయ్యేలా అటవీ భూములను చదును చేసుకుని సాగులోకి తెచ్చుకున్నాము. కానీ ఏం లాభం వాన తడికి వేసిన ఆరుతడి పంటలు కోతకు వచ్చేసరికి ఎండి పోవడం రివాజుగా మారిపోతోంది. పోడు భూముల్లో వానలేని రోజుల్లో నేలకు కాస్త చెమ్మ తగిలితే చాలు బంగారం పండించుకుందుము బాబూ’ అంటూ ఆనాడు గిరిజనులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి మొర పెట్టుకున్నారు. ఫలితంగా ఇందిర ప్రభ పథకాన్ని ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ మెట్ట భూములకు సాగునీరందించుకునే కలను మహానేత సాకారం చేశారు. కానీ ఈనాడు ఆ పథకం అమలు కల్లగా మారిపోయింది. ఇందిర జలప్రభగా పేరు మార్చిన కిరణ్ సర్కారు పథకాన్ని పూర్తి భ్రమగా మార్చేసింది. ఆర్భాటంతో సరి కాంప్రహెన్సివ్ ల్యాండ్ డవలప్మెంట్ ప్రోగ్రాం(సీఎల్డీపీ)లో భాగంగా నిధులు విడుదల చేసి సమీపంలోని కొండ కాలువలు, చెరువుల నుంచి పైపుల ద్వారా పొలాలకు నీరు అందించాలన్నది పథకం ఉద్దేశం. 2009లో ఆయన మరణానంతరం ఈ పథకం కుంటినడకన సాగుతోంది. తర్వాత ఇందిర జలప్రభగా పేరు మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. రాష్ట్రంలో ఈ పథకంలో 10 లక్షల ఎస్సీ, ఎస్టీ భూములను సాగుయోగ్యంగా మారుస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో 28,000 ఎకరాలు సాగులోకి తెస్తామని ప్రకటించి 2011 సెప్టెంబర్‌లో రూ.33.94 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీఓ నెంబరు 315ను విడుదల చేసింది. కానీ ఆర్భాటం అంతా జీవోకే పరిమితం కాగా పథకం చతికిల బడింది. జిల్లాలో ప్రస్తుత పరిస్థితి చూస్తే పథకం పూర్తిగా అటక ఎక్కినట్టేనని అనిపిస్తోంది. 22 మండలాల్లో.. జిల్లాలో ఏడు క్లస్టర్లలోని 22 మండలాల్లో పథకం అమలులో ఉంది. అడ్డతీగల క్టస్టర్ పరిధిలో అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం మండలాలు. రంపచోడవరం క్టస్లర్ నుంచి మారేడుమిల్లి, దేవీపట్నం, రంపచోడవరం మండలాలు. కాకినాడ క్లస్టర్ నుంచి గొల్లప్రోలు, కత్తిపూడి క్లస్టర్ నుంచి తుని, తొండంగి, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, పెద్దాపురం క్లస్టర్ నుంచి రంగంపేట, పెద్దాపురం. ప్రత్తిపాడు క్లస్టర్లో గోకవరం, జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రాజమండ్రి క్లస్టర్ నుంచి కోరుకొండ, రాజానగరం మండలాల నుంచి లబ్దిదారులను ఎంపిక చేశారు. అమలు ఇలా.. 2011లో 15,778 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఇందులో 636 ఎస్సీ లబ్దిదారులకు చెందినభూమి 860 ఎకరాలు ఉండగా, 4822 మంది గిరిజనులకు చెందిన 14,918 ఎకరాలు ఉంది. ఈ భూమిని సాగునీటి సౌకర్యం కల్పించడం కోసం 1072 బ్లాకులుగా విభజించి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2011 సంవత్సరాంతానికి 356 బ్లాకుల్లో 1744 పనులు ప్రతిపాదించారు. కాగా వీటిలో ఇప్పటికి 342 బ్లాకుల్లోని 1500 లకు పైగా పనులకు పరిపాలనా పరమైన అనుమతులు లభించగా 107 బ్లాక్‌లలోని 326 పనులు పూర్తిచేయగలిగారు. ఇంకా 78 డివిజన్లలో 136 పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పుకొస్తున్నారు. రెండేళ్లుగా పనుల్లో ప్రగతి మందగించింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తిగా స్తంభించినట్టు తెలుస్తోంది.