సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధనే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జిల్లా శ్రేణులకు సూచించారు. తెలంగాణ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో సమావేశంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లా నాయకులు జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ నిర్మాణంతో పాటు జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ భేటీలో చర్చించారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పార్టీని మరింత బలోపేతం చేయాలని, అభివృద్ధి, సంక్షేమం నినాదాలతో ముందుకెళ్లాలని నాయకులకు సూచించారు. సమావేశంలో జిల్లా రైతాంగానికి సంబంధించిన అంశాలపై చాలాసేపు మాట్లాడామని, జిల్లాకు చెందిన అంశాలను జగన్ అడిగి తెలుసుకున్నారని పార్టీ జిల్లా నాయకులు ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణలో ఒక చివర్లో ఉన్న ఖమ్మం జిల్లాకు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు రావడం కష్టంగా ఉన్న నేపథ్యంలో గోదావరి నీటిని ఆ భూములకు తీసుకువచ్చే దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌తో పాటు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పరిస్థితులపై చర్చిం చినట్లు వెల్లడించారు. సమావేశంలో భాగంగా పార్టీ నిర్మాణం, పలు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది.
ఈ సమావేశంలో పార్టీ ఖమ్మం పార్లమెంటరీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లుతో పాటు జిల్లాకు చెందిన నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
రాజన్న బాటలో...
Published Tue, Feb 25 2014 2:12 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement