న్యూజెర్సీలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి, నివాళులు!
న్యూజెర్సీలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి, నివాళులు!
Published Sun, Sep 15 2013 7:49 PM | Last Updated on Sat, Jul 7 2018 3:36 PM
న్యూజెర్సీ:
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాలుగవ వర్ధంతిని న్యూజెర్సీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ అభిమానులు సెప్టెంబర్ 7 తేది రాత్రి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన ఈ శిబిరానికి అమెరికన్ రెడ్ క్రాస్ పూర్తి సహకారాన్ని అందించింది.
అదే రోజు సాయంత్రం న్యూ జెర్సీలో జరిగిన వర్ధంతి సభకి పదిహేను వందల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ చైర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రేంసాగర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటు పూడ్చలేనిది. మహానేత ప్రభుత్వ హయంలోఅన్ని రంగాలలో, వర్గాలలో తన ముద్ర ప్రగాడంగా ఉండేటట్టు వివిధ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి డాక్టర్ వైఎస్సార్ అమరుడయ్యరని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంకా ప్రజల మధ్య జీవించి ఉంటే పేద ప్రజలకి ఇంకా మంచి జరిగేది అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అనేకానేక సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలోనే అత్యంత ప్రతిభావంత నేతగా నిలిపి, దేశ రాజకీయాలనే ప్రభావితం చేసిన నేతగా రాజశేఖర్ రెడ్డి గారిని అభివర్ణించారు. రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటు ప్రస్పుటంగా కనిపిస్తున్నదని, మనమంతా ఆ మహానేత అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనలో నిర్విరామ కృషి చెయ్యడమే ఆయనకి మనమిచ్చే అత్యంత ఘన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, డాక్టర్ పైల్ల మల్లా రెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ రాఘవ రెడ్డి, రాజేశ్వర రెడ్డి గంగసాని, రమేష్ అప్పారెడ్డీ, సురేష్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అద్యక్షుడు ఆళ్ళ రామి రెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, విజయ బత్తుల, శివా మేక, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వివిధ రాష్ట్ర స్తాయి కోఆర్డినేటర్లు, అమెరికా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు.
Advertisement