Prem Sagar Reddy
-
తాడేపల్లి: సీఎం జగన్‌ను కలిసిన ప్రైమ్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఛైర్మన్
-
Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ
‘అప్పట్లో.. అనగనగా ఓ ఊరు.. రాత్రయితే కానరాని వెలుతురు.. కిరోసిన్ బుడ్డి కిందే చదువు.. అయినా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే.. సాధారణ రైతు బిడ్డగా జన్మించి.. అగ్రరాజ్యానికి హృదయ స్పందనై నిలిచారు.. జన్మ భూమిని.. పల్లె ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు.. సప్త సముద్రాల అవలి నుంచే సొంతూరి దాహం తీరుస్తూ.. విద్యతోనే ఉన్నతని నిరూపిస్తూ.. గ్రామంలో బాటలు వేస్తూ.. ప్రజలందరితో ఎంతమంచి మా ‘ప్రేమ్’యో అంటూ కీర్తి పొందారు. ఆయన మరెవరో కాదు.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి..’ సాక్షి,అమరావతి: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అక్కడ అడుగు పెట్టాలంటేనే ఎంతో కష్టం. కానీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో ఆస్పత్రి కట్టాడు. అప్పటి వరకు ఏ తెలుగువాడికి కూడా ఇంత సాహసం చేయలేదు. అనతి కాలంలోనే ప్రైమ్ హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రేమ్ అమెరికాకు హృదయ స్పందనగా మారిపోయారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం అనే ఒక చిన్న గ్రామంలో 1949లో జూన్ 26న ననమాల సుందరామిరెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో ప్రేమ్ పెద్దవారు. గ్రామంలోనే హైసూ్కల్ వరకు చదువుకున్నారు. విజయవాడలో పీయూసీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెల్లూరులో హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోరి్నయాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో ప్రేమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇంటర్నేషన్ల్ సంస్థను స్థాపించి వైద్య అవసరాలకు అనుగుణంగా విస్తరించారు. ఇందులో భాగంగానే చినోవ్యాలీలో 126 పడకల చినోవ్యాలి మెడికల్ సెంటర్‌ను, కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. 45 వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యూఎస్‌లో అగ్ర వైద్య వ్యవస్థల్లో ఏడాదికి 5 బిలియన్ల డాలర్ల టర్నోవర్‌తో టాప్ 5 స్థానంలో ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమెరికాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, స్థానిక ప్రభుత్వం నుంచి అనేక ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. సాహితీ సేవలోనూ.. సాహిత్యం అంటే ప్రేమ్‌రెడ్డికి చాలా ఇష్టం. దువ్వూరి రామిరెడ్డి రచించిన గులాబీ తోట, పండ్లతోట అనే ముద్రణకు నోచుకోని రెండు కావ్యాలను సొంతంగా ముద్రించారు. కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం కూడా చేశారు. ఆయని ఇతర రచనలను ద లాస్ట్ ఫేర్వెల్ అండ్ అదర్ పోయెమ్స్ పేరుతో పెద్ద సంపుటిగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇదీ కుటుంబం.. ప్రేమ్ ఎస్.రెడ్డి తనతోపాటు మెడిసిన్‌ను అభ్యసించిన అమ్మాయినే (శాంతిరెడ్డి) వివాహం చేసుకుని జంటగా అమెరికాలో అడుపెట్టారు. ప్రేమ్‌రెడ్డికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి కవితారెడ్డి అమెరికాలోని పిడియాట్రిక్స్ పూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రెండో అబ్బాయి అశోక్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మూడో సంతానం సునీతారెడ్డి. నేడు ప్రేమ్‌కు పౌర సన్మానం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు నెల్లూరులో ప్రేమ్‌సాగర్‌రెడ్డికి పౌర సన్మానం చేయనున్నారు. 15 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు వస్తున్న నేపథ్యంలో సోమవారం గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మధ్య ఘనంగా సత్కరించనున్నారు. సొంతూరిని మర్చిపోలేదు ప్రేమ్ ఎస్.రెడ్డి ఎంత ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోలేదు. అందుకే తన సొంత గ్రామంలో హైసూ్కల్‌ను కట్టించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 50 చుట్టుపక్కల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ.కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన బాధ్యతను చాటుకున్నారు. సంపాదించినదంతా సమాజానికే.. ‘నేనెప్పుడూ పేరు కోసమో, ప్రచారం కోసమో పనిచేయలేదు... సంపాదించినదంతా సమాజానిదే.. అందుకే సమాజసేవకే దానిని ఉపయోగించాలి. ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే సమాజసేవకు ఉపయోగిస్తున్నాను. జన్మనిచ్చినందుకు మాతృభూమికి కూడా సేవ చేస్తున్నాను‘.. అంటారు డాక్టర్ ప్రేమ సాగర్‌రెడ్డి. -
‘తెలుగు ఎన్నారై ఆఫ్ ది ఇయర్’ గా డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి
విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో నిడిగుంటపాలెం అనే ఒక చిన్న గ్రామానికి చెందిన ప్రేమ్‌సాగర్ రెడ్డి అక్కడే హైస్కూల్ వరకు చదువుకున్నారు. తిరుపతిలోని ఎస్.వి మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశారు. హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీ తో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోర్నియాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో యు.ఎస్.లోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. యు.ఎస్.లో టాప్–10 వైద్యవ్యవస్థల్లో ఒకటిగా ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. ఒక చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. -
నిరుపేదలకు వరం ఆరోగ్యశ్రీ
సార్వత్రిక వైద్య బీమా కల్పించినప్పుడే దేశ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరంలాగా మారిందని అమెరికాలో ప్రైమ్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ సంస్థాపకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి చెబుతున్నారు. స్నేహానికి ప్రాణం పెట్టే వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో దేశంలోనే ఒక ట్రెండ్ సృష్టిం చారని, పేద ప్రజలకు సాయం చేయాలన్న వైఎస్ఆర్ ఆలోచనలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటున్నాయని చెబుతున్న ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... అమెరికా దాకా మీ జీవిత పయనం ఎలా సాగింది? పల్లెటూళ్లో పుట్టాను. లాంతరు వెలుగులో చదువుకున్నాను. మా వంశంలో నేనే మొదటిసారిగా హైస్కూలుకి వెళ్లాను. తర్వాత తిరుపతికి వెళ్లి చదువుకుని అక్కడినుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వచ్చాను. అమెరికాలో కార్డియాలజీ చాలా అభివృద్ధి చెందింది. నా భార్య కూడా డాక్టర్. 1976లో అమెరికా వచ్చి కార్డియాలజీ ప్రాక్టీస్ చేశాము. మొదట్లో కార్డియాలజీ పేషెంట్లకు సేవలందించడానికి తగిన స్థలం ఉండేది కాదు. దాంతో కాలిఫోర్నియాలో సొంతంగా ఆసుపత్రి కట్టించాను. ఇండియాలోలాగా ఒక డాక్టర్ సొంతంగా ఆసుపత్రి నిర్మించడం చాలా కష్టం. తర్వాత అనేక ఆసుపత్రులు నిర్మించాను. ముఖ్యంగా విఫలమైన ఆసుపత్రులను తీసుకుని వాటిలో పెట్టుబడి పెట్టి మంచి డాక్టర్లను నియమించి వృద్ధి చేశాను. ప్రస్తుతం అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 45 ఆసుపత్రులను నిర్వహిస్తున్నాను. మీ సిబ్బంది ఎందరికి వైద్య సేవలు అందిస్తున్నారు? అమెరికాలోని మా ఆసుపత్రుల్లో 45 వేల మంది సిబ్బంది ఉంటున్నారు. డాక్టర్లయితే మా ఆసుపత్రుల్లో ఒక్కో దానిలో కనీసం 400 మంది ఉంటారు. వీరిలో పూర్తిగా ఆసుపత్రికే అంకితమై ఉండే వైద్యులు వందమంది ఉంటారు. అంటే మా 45 ఆసుపత్రుల్లోనూ కనీసం 5,000 మంది పూర్తి కాలం డాక్టర్లు పనిచేస్తున్నారు. నా వృత్తిపట్ల నా అంకితభావమే ఈ విజయానికి కారణం. డాక్టర్ మా గుండెలోకి బెలూన్ పంపి, గుండెను తెరిచి దాని లోపాన్ని నయం చేసి మమ్మల్ని బతికించాడనే కృతజ్ఞతను రోగులు మాకు చెబుతున్నప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. భారతీయ వైద్యరంగం మెరుగుదలకు ఏం చేయాలి? ఇక్కడ కూడా వైద్య బీమా వ్యవస్థ రావాలి. దివంగత సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగానే ట్రెండ్‌ని సృష్టించిన మంచి కార్యం. ప్రభుత్వం నుంచి జరిగే ఇలాంటి కార్యక్రమాలే కాకుండా చిన్నా పెద్ద కంపెనీలు సైతం తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు, సిబ్బం దికి, కార్మికులకు ఇలాంటి ఆరోగ్యబీమా పథకాలను అందిస్తే చాలామందికి సహాయ కారిగా ఉంటుంది. మీరు ఇండియాలో కార్యక్రమాలు చేస్తుంటారా? అప్పుడప్పుడూ మాత్రమే ఇండియాకు వస్తుంటాను. ఛారిటీ పనులు చేస్తుంటాను. మా ఊర్లో హైస్కూలు, వాటర్ ప్లాంట్లు కట్టించాను. కాంక్రీట్ రోడ్లు వేయిం చాను. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో మరో 50 ఊర్లలో మంచి నీటి బావులు తవ్వించాను. వైఎస్సార్ ఫౌండేషన్ ఏర్పాటుచేసి, ఎవరైనా 50 శాతం నిధులు అందిస్తే మరో 50 శాతం నిధులు నేను వేసుకుని వాటర్ ప్లాంట్లు పెట్టిస్తానని చెప్పాను. వైఎస్సార్‌తో మీ అనుబంధం? ఒక సంవత్సరం పాటు ఆయనతో కలిసి తిరుపతిలో పనిచేశాను. ఆయన హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడు నేను కాలేజీలో ఉండేవాడిని. అప్పటినుంచి చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. చాలాకాలంగా ప్రతిపక్షంలో ఉండి తర్వాత సీఎం అయ్యారు. జాతీయ నాయకుడు అయ్యారు. ఎంతమందికి తాను సహాయం చేయగలను అనే ఆయన ఆలోచన శాశ్వతంగా అలా ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఆయన దార్శనికత చాలా గొప్పది. ఆరోగ్య శ్రీని తీసుకురావడం, రైతుల కష్టాలను ఆదుకోవడం, జలయజ్ఞాలు వంటివి చాలా మంచిపనులు. వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఆరోగ్యపరంగా చాలా హెల్తీగా ఉంటాడు. అంతమంది మనుషులను చూసి, వారితో మాట్లాడిన తర్వాత తనకు విషయాలు లోతుగా అర్థమవుతున్నాయనిపిస్తోంది. ప్రజల కోరికలు, వారి కష్టాలు, వారేం ఆశిస్తున్నారు అనే పరిశీలన ఆయనను మంచి రాజకీయనేతగా మారుస్తోందనుకుంటున్నాను. అమెరికాలో ఉండి తెలుగు రాష్ట్రాల గురించి తెలుసుకుంటూంటారా? ఇక్కడి విషయాలు అన్నీ తెలియవు. వచ్చే పోయే స్నేహితులు, పరిచయస్తులు చాలావరకు చెబుతుం టారు. ఏం జరుగుతోంది అనేది అర్థమవుతుం టుంది. రెండు రాష్ట్రాలుగా విడిపోవడం కొందరికి మంచిదేమో నాకు తెలీదు కానీ కలిసుంటే బాగుం డేది అని సాధారణంగా అనుకుంటూ ఉంటాం కదా. అందరూ తెలుగోళ్లే కదా మనకు రెండుగా విభజన ఎందుకు అనుకునేవాడిని. తెలుగు రాష్ట్రాల్లో పాలనపై మీ అభిప్రాయం? అంత పూర్తిగా తెలీదండి. కానీ తెలంగాణలో పాలన బాగా జరుగుతోందని, ఏపీలో రాజకీయాలు ఎక్కువగా జరుగుతుంటాయని వింటుంటాను. రాజకీయ పార్టీల మధ్య నిత్య ఘర్షణ ఉంటే అభివృద్ధి జరగదని నేననుకుంటాను. ఘర్షణతోనే కాలం గడిచిపోతుంటే వనరులు, శక్తి అన్నీ దానికే ఖర్చయిపోతాయి. అలా కాకుండా ఉన్న వనరులను పైకి తీసుకుపోయేటట్టు పనిచేస్తే బాగుంటుంది. స్నేహం ఏర్పడితే వైఎస్ఆర్ జీవితాంతం దాన్ని నిలబెట్టుకుంటారంటారు, మరి మీ విషయం? మీరన్నది నూటికి నూరుపాళ్లూ కరెక్ట్. మామధ్య ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు రాలేదు. స్నేహభావంతో పరస్పరం గౌరవించుకునేవాళ్లం. మామధ్య ఎప్పుడూ మనస్ప ర్థలు రాలేదు. వైఎస్ జగన్ ఈసారి సీఎం అవుతారని అనుకుంటున్నారా? నా స్నేహితుడి కుమారుడాయన. ఆయనకు మంచే జరగాలని కోరుకుంటాను. కానీ రాజకీయాలు ఎలా తిరుగుతాయో నాకు తెలీదు కదా. ఒకసారేమో వారు గెలుస్తారంటారు. మరోసారేమో వీరు గెలుస్తారంటారు. కానీ అధికారం వైఎస్ జగన్‌కు వస్తే ప్రజలకు మంచే జరుగుతుందనుకుంటాను. యువతకు మీరిచ్చే సందేశం? లక్ష్యం లేకుండా గడిపేయవద్దు. ముఖ్యంగా చదువు విషయంలో. సరైన కాలేజీలను ఎంపిక చేసుకుని చదవడం అవసరం. విజ్ఞానం, అంకితభావం, కష్టపడి పనిచేయడం ఇవే ఎవరైనా నేర్చుకోవాలి. అమెరికాలో తెలుగు డాక్టర్లు, ఐటీ నిపుణులు చాలా సక్సెస్ పొందుతున్నారు. అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారు. కష్టపడి పైకి రావడం అంటే ఇదే. అందరికీ అభినందనలు. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2v3SquC https://bit.ly/2AtX3Do -
అమెరికాలో తెలుగు సంబరం
ఫిలడెల్ఫియా (అమెరికా) : సప్త సముద్రాల ఆవల తెలుగు మహా సంబరానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నార్త్ అమెరికా తెలుగు అసొషియేషన్ (నాటా) ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సిద్ధమవుతోంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం వేదికగా జులై 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న నాటా మహా సభలకు ఏకంగా 13 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు నాటా సభలకు అతిథులుగా హాజరు కానున్నారు. సామాజిక సేవ, తెలుగు సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించాలన్న లక్ష్యంగా ఏర్పడిన నాటా.. అనతి కాలంలో మహా వృక్షంగా మారింది. విద్యా, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల కోసం అమెరికా వచ్చే వారిని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన నాటా.. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి సేవలందించడం ప్రారంభించింది. నాటా ప్రతి రెండేళ్లకి ఒకసారి కన్వెన్షన్ నిర్వహిస్తుంది. 2016లో డల్లాస్‌లో, ఈ సారి ఫిలడెల్ఫియోలో వేడుకలు నిర్వహిస్తోంది. నాటా సమాజ సేవలో ముందుండడం, పూర్తి పారదర్శకంగా వ్యవహరించడం, తెలుగు వారి అవసరాలు తీర్చేలా ముందుకెళ్తోంది. గత రెండేళ్లలో అమెరికాలో తలెత్తిన ప్రకృతి విపత్తుల సమయంలోనూ తనవంతు సహాయ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సారి మహాసభలకు వివిధ రంగాల్లో ప్రముఖులు, వేర్వేరు పార్టీల రాజకీయ నాయకులు, పలువురు అధికారులు హాజరు కానున్నారు. ఇక మహాసభల్లో సాంస్కృతిక వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పలువురు సినీ నటులు, దర్శకులు, గాయినీ గాయకులు, రచయితలు, టీవీ ఆర్టిస్టులు నాటా వేడుకల కోసం అమెరికా వస్తున్నారు. మహాసభలకు ముందస్తుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. నాటా నారి పేరుతో మహిళా సదస్సులు, యువత కోసం యూత్ వెల్నెస్ కార్యక్రమాలు, అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వైద్య శిబిరాలు, యూఎస్‌లోని వేర్వేరు నగరాల్లో ఆర్ట్ కాంపిటీషన్స్ , మ్యాట్రిమోనీ కార్యక్రమాలు నిర్వహించింది. నాటా మాట పేరుతో ఓ పత్రిక కూడా విడుదల చేసింది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి, అధ్యక్షుడు అమెరికాలోని అన్ని రాష్ట్రాల నుంచి నాటాకు ప్రాతినిధ్యం ఉంది. నిజాయతీ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక సేవ అనే పునాదులపై నాటాను ముందుకు తీసుకెళ్తున్నాం. తెలుగు సంసృతి, వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తున్నాం. ఈ సారి ఫిలడెల్ఫియాలో జరగనున్న మహాసభలకు 13వేల మంది రానున్నారని సగర్వంగా చెబుతున్నాను. గత ఆరు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాటా సేవాదళం ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణలోని ఎన్నో మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాం. బాలిక సంరక్షణ కోసం వరంగల్‌లో నిర్వహించిన జానపద నృత్య రీతులు నాటా చరిత్రలో సరికొత్త మైలురాయి. ‘సమాజ సేవే నాటా మాట - సంసృతి వికాసమే నాటా బాట’ అన్న మా నినాదాన్ని నిజం చేసే దిశగా ప్రయాణిస్తున్నాం. డాక్టర్ ప్రేం సాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్ నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ (నాటా)తో ఎన్నారైలకు వీడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి మహాసభలకు తెలుగు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దీవిస్తున్నారు. తెలుగు అనే భాష కింద అంతరాల్లేవు. ప్రాంతీయ బేధాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. ఎక్కడో నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. నాకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా ఊళ్లో కరెంటు గానీ, తాగు నీరు గానీ లేవు. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి అతి పెద్ద ఆస్పత్రుల నెట్ వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45వేల అమెరికన్లకు ఉద్యోగలిచ్చా. మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు. నేను సంపాదించిన దాన్ని సమాజానికి పంచేందుకు దాత్రుత్వాన్ని ఎంచుకున్నా. సమాజానికి వీలైనంత అందిస్తున్నా. అదే స్పూర్తితో నాటాను ఏర్పాటు చేశాం. నడిపిస్తున్నాం. నాటా వేదికగా వైఎస్సార్ జయంతి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని నార్త్ అమెరికా తెలుగు అసొసియేషన్ వేదికగా నిర్వహిస్తామని వైఎస్సార్సీపీ తెలిపింది. నాటా నిర్వహించనున్న పొలిటికల్ ఫోరంలో భాగంగా డా.వైఎస్సార్ ను స్మరించుకుంటామని ప్రకటించింది. మహా సభలకు హాజరు కావాలని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌ను ఆహ్వానించారని, అయితే పాదయాత్ర కారణంగా ఆయన రాలేకపోతున్నారని పార్టీ తెలిపింది. నాటా ప్రతినిధులు, అతిథులను ఉద్దేశించి తన సందేశాన్ని వైఎస్ జగన్ పంపనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ వేడుకలకు హాజరు కానున్నారని చెప్పారు. -
తెలంగాణలో రియల్ జోరు!
* హైదరాబాద్‌కు దీటుగా ద్వితీయ శ్రేణి నగరాలు * వరంగల్‌లో 40%, కరీంనగర్లో 30% పెరిగిన స్థిరాస్తి ధరలు * భాగ్యనగరంలో వృద్ధి అంతంతే * రాజధానిలో అనిశ్చితే కారణమంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారం అనగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాదే. కానీ, రెండేళ్లుగా భాగ్యనగరంలో రియల్ వ్యాపారం పడకేసింది. అయితే ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ వ్యాపారం జోరందుకుంది. ప్రత్యేకించి వరంగల్‌లో 40 శాతం, కరీంనగర్లో 30 శాతం మేర ధరలు పెరిగాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల్లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో పన్ను రాయితీలు, సరికొత్త పథకాలతో దేశ, విదేశీ కంపెనీలు మరింత దృష్టి సారించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలనూ ఆకర్షించే సత్తా గల వరంగల్, కరీంనగర్ జిల్లాల అభివృద్ధి అవకాశాలపై ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో హైటెక్ ప్రాంతమేదైనా ఉందంటే అది వరంగల్ జిల్లానే. వరంగల్, హన్మకొండ, కాజీపేట మూడు నగరాలను ‘ట్రై సిటీస్’గా పిలుస్తారు. తెలంగాణ రాష్ర్ట ప్రకటన తర్వాత అందరి చూపు వరంగల్, కరీంనగర్ జిల్లాలపైనే పడింది. దీంతో వరంగల్‌లో 40 శాతం, కరీంనగర్లో 30 శాతం స్థిరాస్తి ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం, ఐటీ, ఫార్మా, కాటన్ వంటి పరిశ్రమలతో అభివృద్ధి చెందటం, త్వరలో గ్రేటర్‌గా రూపాంతరం చెందటం, విమానాశ్రయాల ఏర్పాటు వంటి కారణాలనేకం. ఐటీ, ఫార్మా వంటి పరిశ్రమలకే కాదు విద్యా, వైద్యానికి కూడా వరంగల్ కేంద్ర బిందువుగా మారనుంది. కొత్త రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులుంటాయని కేంద్రం ప్రకటించడంతో, విమానాశ్రయాన్ని పునరుద్ధరణ చేస్తామని పార్టీలూ ప్రకటించడం వంటి వాటితో పరిశ్రమల్లో ఉత్సాహం పెరిగింది. ఐటీ రంగంలో.. హైదరాబాద్-వరంగల్ రోడ్ ఐటీ కారిడార్‌గా మారనుంది. ఇప్పటికే మడికొండలో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు 30 ఎకరాలను స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా అభివృద్ధి చేయనుంది. ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌కు వంద కి.మీ. దూరంలో ఉండటం, నేషనల్ హైవేతో అనుసంధానమై అన్ని రకాల రవాణా మార్గాలుండటం వంటివెన్నో ఐటీ కంపెనీలకు కలిసొస్తున్నాయి. పత్తి, నూనె పంటలకు, ఖనిజాలకు, అటవీ ప్రాంతాలకు వరంగల్ పేరుగాంచింది కాబట్టి ఇక్కడ వ్యవసాయ, ఖనిజాధారిత, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ఫ్యాప్సీ సూచించింది. ఖమ్మం, నర్సంపేట రోడ్లు ఎడ్యుకేషనల్ హబ్‌గా, పెట్టబడుల ప్రాంతంగా అభివృద్ధి చెందనుందని నిపుణులు చెబుతున్నారు. మూడేళ్లుగా రియల్ జోరు: వరంగల్‌లో మూడేళ్ల నుంచి స్థిరాస్తి ధరలు పెరిగాయని వరంగల్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ఏటా వరంగల్‌లో 500 నుంచి వెయ్యి వరకు ఫ్లాట్లను విక్రయిస్తామన్నారు. నక్కలగుట్ట, కేయూ వర్శిటీ వంటి ప్రాంతాల్లో, మెయిన్ రోడ్‌కు ఇరువైపులా గజం ధర రూ.లక్షకు పైగానే పలుకుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం చ.అ. ధర రూ.2,000లున్న ప్రాంతాల్లో ఇప్పుడు రూ.2,200 నుంచి 2,700 మధ్య ఉంది. ఇప్పటికే వరంగల్‌లో కీర్తిలాల్, కల్యాణ్ వంటి జువెల్లరీ షాపులు, శ్రీదేవీ మల్టికాంప్లెక్స్, రిలయన్స్, మెగామార్ట్, కళానికేతన్, సెంట్రో వంటి షాపింగ్ మాళ్లున్నాయి. శ్రీ బాలాజీ కన్స్ట్రక్షన్స్ కేయూ యూనివర్శిటీ క్రాస్ రోడ్లో ‘గేట్ వే’ పేరుతో 2 లక్షల 50 వేల చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్‌ను నిర్మిస్తోంది. హన్మకొండలో కేఎఫ్‌సీ, డీ-మార్ట్, బిర్లా గ్రూప్ సంస్థలు, నర్సంపేట్ రోడ్లో వాల్‌మార్ట్ రానున్నాయి. కొత్త రాష్ర్టంలో పన్ను మినహాయింపులూ ఉండటంతో ఇప్పుడు మల్టినేషనల్ బ్రాండ్ కంపెనీలు క్యూ కడతాయని నిపుణులు చెబుతున్నారు. మొదట దృష్టి పెట్టాల్సిందిక్కడే: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటుకానున్న కొత్త ప్రభుత్వం వరంగల్‌లో మొదటగా దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలున్నాయని వరంగల్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. * వరంగల్ మున్సిపాలిటీలో నేటికీ 1971 నాటి మాస్టర్ప్లాన్నే అమలు చేస్తున్నారు. దీంతో అభివృద్ధి నలువైపులా జరగట్లేదు. కొత్త మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించారు. రాబోయే ప్రభుత్వం వెంటనే మాస్టర్ ప్లాన్‌కు ఆమోదించాలి. * వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలి. ఓఆర్ఆర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ తగ్గుతుంది. లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 70 శాతం ప్రభుత్వం, 30 శాతం ప్రైవేటు వ్యక్తులు భరించేందుకైనా సిద్ధంగా ఉండాలి. * వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ చేయాలి. పారిశ్రామిక ప్రాంతాల నుంచి ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీ. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లును నిర్మించాలి. కరీంనగర్‌కూ పెద్దపీటే.. తెలంగాణలో నాల్గో అతిపెద్ద నగరం కరీంనగర్. 3 లక్షల జనాభాతో 11,823 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు గని సింగరేణి, 2,600 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే రామగుండం ఎన్టీపీసీలతో దేశంలో గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చెందనున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరీంనగర్లో బొగ్గు గనులు ఉన్న దృష్ట్యా విద్యుదుత్పాదనకు అపార అవకాశాలున్నాయి. పత్తి, నూనె, రైస్ మిల్లుల స్థాపనకు కరీంనగర్ అనుకూలమని ఫ్యాప్సీ చెబుతోంది. రియల్ వ్యాపారం విషయానికొస్తే.. రెండేళ్లుగా కరీంనగర్లో భూమి ధర 50 శాతానికి పైగా, ఫ్లాట్ల ధరలు 30 శాతం మేర పెరిగాయని కరీంనగర్ చాప్టర్ భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ప్రెసిడెంట్ అజయ్ కుమార్ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. చ.అ. రూ.1200-1,500 మధ్య ఉండేది కాస్త ఇప్పుడు రూ.2,500-2,700 మధ్య పలుకుతోందన్నారు. ఏటా కరీంనగర్లో 2 వేల ఫ్లాట్లను విక్రయిస్తున్నామన్నారు. * జగిత్యాల రోడ్లో ఎకరం విస్తీర్ణంలో రిలయన్స్ సూపర్ మెగామార్ట్ నిర్మాణం జరుగుతోంది. కేఎఫ్‌సీ, మెగ్ డొనాల్డ్ వంటి ఫుడ్ సెంటర్లూ రానున్నాయి. ఇప్పటివరకు కరీంనగర్లో ఐదంతస్తుల భవనాలు మాత్రమే ఉండేవి. శ్రీనివాస్ బిల్డర్స్ గణేష్‌నగర్‌లో పదంతస్తుల హై రైజ్ బిల్డింగ్‌ను నిర్మిస్తోంది. కమాన్ ఏరియా, బైపాస్ రోడ్లో 80 వేల చ.అ., 70 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు భారీ వాణిజ్య సముదాయాలు రానున్నాయి. మరో 70 నివాస భవన సముదాయాలు నిర్మాణ అనుమతి కోసం వేచిచూస్తున్నాయి. * పభుత్వ ఇసుక యార్డ్ లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇసుకను కొనాల్సి వస్తోంది. దీంతో ట్రాక్టర్ ఇసుక ధర రూ.600-700 మధ్య ఉండేది కాస్త రూ.2,500-3,300లుగా చెబుతున్నారు. వచ్చే కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని కోరారు. * కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తే ట్రాఫిక్ తగ్గడమే కాకుండా 500-600 ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందన్నారు. వారం రోజుల్లో తెలంగాణ రాష్ర్టంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి పలు సూచనలు చేశారు. * చిన్న, పెద్ద ఎలాంటి ప్రాజెక్ట్‌లైనా ప్రారంభించేందుకు ముందుకొచ్చే దేశ, విదేశీ నిర్మాణ సంస్థలను ప్రాజెక్ట్ అనుమతుల కోసం ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా.. 15 నుంచి 30 రోజుల్లోనే ప్రాజెక్ట్ అనుమతులివ్వాలి. లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. * గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) వంటి ప్రాజెక్ట్‌లో మాదిరిగా తెలంగాణలో ఏ చిన్న పరిశ్రమనైనా స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ఆయా ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించి ఇవ్వాలి. * ఐదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు వ్యాట్, రిజిస్ట్రేషన్ చార్జీల వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి. హైదరాబాద్‌కు తప్ప తెలంగాణలోని వెనకబడిన జిల్లాల్లో పన్ను మినహాయింపులివ్వాలి. * పన్ను రాయితీలు, త్వరితగతిన అనుమతులు వంటి హామీలను నోటిమాటిలతో సరిపెట్టకుండా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలను నెరవేరిస్తే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుంది. * ఏటా భూమి ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు. భూములను వేలం వేయటమూ చేయకూడదు. దీంతో ప్రభుత్వమే ధరలు పెంచుతోందని ప్రైవేటు వ్యక్తులూ స్థిరాస్తి ధరలను పెంచేస్తున్నారు. దీంతో ధరలు అందుబాటులో ఉండట్లేదు. * సిమెంట్, ఇసుక, ఇటుక, ఉక్కు వంటి నిర్మాణ సామగ్రి ధరలను ఏటా పెంచరాదు. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలు తాండూర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఏటా ఆదిలాబాద్ నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నులు, తాండూర్ నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి అవుతుంది. వీటి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి. * తెలంగాణ రాష్ట్రంలో 3 వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడనుంది. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తయితే విద్యుత్ కొరత 11 వేల మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో బొగ్గు, సౌర, పవన, బయోమాస్ విద్యుత్ కేంద్రాలను పెద్దఎత్తున నెలకొల్పాలి. -
న్యూజెర్సీలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి, నివాళులు!
న్యూజెర్సీ: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నాలుగవ వర్ధంతిని న్యూజెర్సీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ అభిమానులు సెప్టెంబర్ 7 తేది రాత్రి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ కోర్ కమిటీ మెంబర్ డాక్టర్ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెండు వందల మందికి పైగా రక్తదానం చేసిన ఈ శిబిరానికి అమెరికన్ రెడ్ క్రాస్ పూర్తి సహకారాన్ని అందించింది. అదే రోజు సాయంత్రం న్యూ జెర్సీలో జరిగిన వర్ధంతి సభకి పదిహేను వందల మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ చైర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్తుడు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రేంసాగర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటు పూడ్చలేనిది. మహానేత ప్రభుత్వ హయంలోఅన్ని రంగాలలో, వర్గాలలో తన ముద్ర ప్రగాడంగా ఉండేటట్టు వివిధ సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి డాక్టర్ వైఎస్సార్ అమరుడయ్యరని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంకా ప్రజల మధ్య జీవించి ఉంటే పేద ప్రజలకి ఇంకా మంచి జరిగేది అని అన్నారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన అనేకానేక సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశంలోనే అత్యంత ప్రతిభావంత నేతగా నిలిపి, దేశ రాజకీయాలనే ప్రభావితం చేసిన నేతగా రాజశేఖర్ రెడ్డి గారిని అభివర్ణించారు. రాజశేఖర్ రెడ్డి గారి లేని లోటు ప్రస్పుటంగా కనిపిస్తున్నదని, మనమంతా ఆ మహానేత అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనలో నిర్విరామ కృషి చెయ్యడమే ఆయనకి మనమిచ్చే అత్యంత ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రేంసాగర్ రెడ్డి, డాక్టర్ పైల్ల మల్లా రెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ రాఘవ రెడ్డి, రాజేశ్వర రెడ్డి గంగసాని, రమేష్ అప్పారెడ్డీ, సురేష్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ అద్యక్షుడు ఆళ్ళ రామి రెడ్డి, ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, విజయ బత్తుల, శివా మేక, ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, వివిధ రాష్ట్ర స్తాయి కోఆర్డినేటర్లు, అమెరికా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు.